E-Paper
Advertisement

ఆమిర్ ఖాన్ రెండో వెడ్డింగ్‌పై రూ.5 కోట్ల సుపారీ.. బాలీవుడ్‌లో ముసలం పుట్టించిన అంతర్మత వివాహం!

ఆమిర్ ఖాన్ రెండో వెడ్డింగ్‌పై రూ.5 కోట్ల సుపారీ.. బాలీవుడ్‌లో ముసలం పుట్టించిన అంతర్మత వివాహం!
Advertisement

Aamir Marriage: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పెళ్లి ఇప్పుడు శాంతిభద్రతల సమస్యగా మారుతుంది.అవును.. విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా సీక్రెట్ గా గౌరీ స్ప్రాట్‌ అనే హిందూ మహిళని  ప్రేమిస్తున్న అమీర్ ఆ ప్రేమాయణానికి ఎండ్ కార్డ్ వేస్తూ జూలై 5న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .

అమీర్ ఖాన్ ని చంపిన వారికి ఏకంగా 5కోట్ల భారీ రివార్డు

Advertisement

అయితే ఈ పెళ్లి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ పద్ధతిలో చేసుకున్నాడు అమీర్.ఇక చాలా దగ్గరి మనుషుల మధ్య జరిగిన తర్వాత ఈ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారానికి దారి తీస్తుంది..ఈ పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే చేసిన కామెంట్స్ మంటలు చల్లారకముందే అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య  మరిన్ని వివాస్పద వ్యాఖ్యలు చేశాడు.అమీర్ ఖాన్ ని చంపిన వారికి ఏకంగా 5కోట్ల భారీ రివార్డు ఇస్తానంటూ ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది .

ఈ వివాదం కేవలం ఒక వర్గానికి పరిమితం కాలేదు

Advertisement

ఇక ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి .మరోవైపు బజరంగ ధళ్ కార్యకర్తలు ముంబై వీధుల్లోకి వచ్చి అమీర్ ఖాన్ కి  వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మలని కాల్చేశారు .ఇది లవ్ జిహాద్ అంటూ హిందూత్వ సంఘాలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ వివాదం కేవలం ఒక వర్గానికి పరిమితం కాలేదు .హిందూ సంఘాల ఆగ్రహం ఒకవైపు ఉంటే అటు ముస్లిం మత పెద్దల  నుంచి కూడా అమీర్ ఖాన్ కు వ్యతిరేకత ఎదురవుతుంది .

ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్  ఈ వివాహం పై ఒక తత్వ జారీ చేశారు.ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం ముస్లిం కాని మహిళని పెళ్లి చేసుకోవడం  నిషేధమని ,అది తీవ్రమైన పాపమని తన పత్వాలో పేర్కొన్నారు.ఇప్పటికైనా అమీర్ ఖాన్ తప్పు తెలుసుకొని పశ్చాతాపపడాలని ఇస్లాం సంప్రదాయాలను గౌరవించాలని హెచ్చరించారు.లేకపోతే మతపరమైన బహిష్కరణ తప్పదని వార్నింగ్ ఇచ్చారు.

ఈ పెళ్లిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు

ఇదిలా ఉంటే మరి కొంతమంది విద్యావంతులు, సామాజిక విశ్లేషకులు వారి కామెంట్లని తప్పుపడుతున్నారు.భారత రాజ్యాంగం ప్రకారం మేజర్లైన ఇద్దరు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకోవచ్చని ఆ హక్కు వాళ్ళకి ఉంటుందని చెప్పుకొచ్చారు.స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా చట్టబద్ధంగా పరస్పరంగికారంతో చేసుకున్న ఈ పెళ్లిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు .

also read :తెరవెనుక హాలీవుడ్: మనకు తెలియని చిత్ర విచిత్రాలు!

మరి కొంతమంది వ్యక్తిగత నిర్ణయాలకు మతాల  రంగు పులిమి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.చూడాలి మరి ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న అమీర్ ఈ వివాదాల నుంచి ఎలా బయటపడతాడో `!

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×