Aamir Khan: ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఈ సినిమా ప్రస్తుతం అమీర్ ఖాన్ యూట్యూబ్లో కేవలం 100 రూపాయలకే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాపై అమీర్ ఖాన్ మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా కేవలం 50 రూపాయలకే తన సినిమాను అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్ ఆగస్టు 15 నుంచి 17 వరకు ఉంటుందని కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే అతి తక్కువ ధరకే యూట్యూబ్లో అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే.. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ ఆఫర్ సగానికి తగ్గించడం నిజంగా ప్రశంసనీయమని చెప్పవచ్చు. ప్రస్తుతం అమీర్ ఖాన్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా సితారే జమీన్ పర్..
స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాపై మహేష్ బాబు(Mahesh Babu) కూడా ప్రశంసలు కురిపించారు. సితారే జమీన్ పర్ అందరి మనసులు దోచుకుంటుందని.. ఈ మూవీ మిమ్మల్ని నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. అలాగే చప్పట్లు కొట్టేలా చేస్తుందని ఆయన చెప్పడంతో సినిమాకు ఊహించని ప్రమోషన్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా చూశాక కచ్చితంగా చిరునవ్వుతో బయటకి వస్తారు అని కూడా మహేష్ బాబు చెప్పడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
సితారే జమీన్ పర్ సినిమా నటీనటులు..
సితారే జమీన్ పర్ సినిమాలో అమీర్ ఖాన్, జెనీలియా జంటగా నటించగా.. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అమీర్ ఖాన్ , అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో వీరితోపాటు ఆరోష్ దత్త, గోపికృష్ణ వర్మ, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అమీర్ ఖాన్ సినిమా..
ఇక అమీర్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. తాజాగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన చిత్రం కూలీ. ఈ సినిమాలో క్యామియో పాత్ర పోషించారు అమీర్ ఖాన్. ఈ సినిమా క్లైమాక్స్ లో ఈయన కీలకంగా కనిపించారు అని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో 15 నిమిషాల పాటు కనిపించారు అని.. ఆ పదహైదు నిమిషాల కోసం దాదాపు 20 కోట్లు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే అమీర్ ఖాన్ ఒకవైపు బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే.. ఇటు సౌత్లో కీలకపాత్రలు పోషిస్తూ సౌత్ అభిమానులను కూడా ఆకట్టుకుంటున్నారు.
ALSO READ: YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు