BigTV English

Dilraju Biopic: తెరపైకి దిల్ రాజు బయోపిక్.. హీరో కూడా ఫిక్స్.. పూర్తి వివరాలివే!

Dilraju Biopic: తెరపైకి దిల్ రాజు బయోపిక్.. హీరో కూడా ఫిక్స్.. పూర్తి వివరాలివే!

Dilraju Biopic:గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో బయోపిక్ హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలను మొదలుకొని.. క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకుల వరకు ఇలా చాలామంది జీవిత కథలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకు హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు, క్రికెట్ , వ్యాపార దిగ్గజాలకు సంబంధించిన బయోపిక్లను మనం ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ కి సంబంధించిన బయోపిక్ రాబోతుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విభిన్నమైన కథలతో.. భారీ బడ్జెట్ లతో సినిమాలను తెరకెక్కించి.. ఇండస్ట్రీ ఎదుగుదలకు పిల్లర్ గా నిలిచిన అతి తక్కువ మంది ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు (Dilraju )కూడా ఒకరు. “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్” అధినేతగా వ్యవహరించడమే కాకుండా.. మరొకవైపు “తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్” (FDC ) చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు.


త్వరలో దిల్ రాజు బయోపిక్..

ఇదిలా ఉండగా ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న చిత్రం తమ్ముడు (Tammudu). నితిన్ (Nithin)హీరోగా.. వేణు శ్రీరామ్ (Venu Sri Ram) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే నితిన్, దిల్ రాజు ఒక స్పెషల్ చిట్ చాట్ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగానే నితిన్ అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియజేశారు దిల్ రాజు. చిట్ చాట్ సెషన్ లో భాగంగా నితిన్ ప్రశ్నిస్తూ.. బయోపిక్ తీసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా..? అని నితిన్ ప్రశ్నించారు.


బయోపిక్ పై దిల్ రాజు క్లారిటీ..

దిల్ రాజు మాట్లాడుతూ.. “నా బయోపిక్ నేను తీయలేను కదా.. ఎవరైనా తీస్తే దానికి సపోర్ట్ చేస్తాను. 1994లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చాను. నాదొక బిగ్ జర్నీ. ఈ సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసాను. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను.. చూడాల్సినవి, చూడకూడనివి అన్నీ చూసేసాను..” అంటూ దిల్ రాజు తెలిపారు.

బయోపిక్ లో హీరో ఫిక్స్..

ఇక బయోపిక్ చేస్తే ఏ హీరోతో బయోపిక్ చేయాలనుకుంటున్నారు? అని మళ్లీ నితిన్ ప్రశ్నించగా.. “ఇంకెవరు. నువ్వే” అంటూ క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. నిజానికి నితిన్ దిల్ రాజు సోదరుడిలా ఉంటారని , ఇప్పటికే ఎంతోమంది కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తన బయోపిక్ తీయాలి అంటే నితిన్ బాగా సెట్ అవుతారని దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే భవిష్యత్తులో దిల్ రాజు బయోపిక్ ప్రారంభం అవుతుందని, అందులో నితిన్ హీరోగా నటించబోతున్నారని దిల్ రాజు, నితిన్ కూడా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ బయోపిక్ కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి దిల్ రాజు బయోపిక్ ను తెరకెక్కించడానికి ఏ డైరెక్టర్ ముందుకు వస్తారో చూడాలి.

దిల్ రాజు సినీ ప్రస్థానం..

దిల్ రాజు సినీ ప్రస్థానం.. 1994లో ఇండస్ట్రీలోకి వచ్చిన దిల్ రాజు.. 1997లో ‘పెళ్లి పందిరి’ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ ప్రారంభించి.. 2003లో ‘దిల్’ సినిమాతో నిర్మాతగా మారి.. ఈ సినిమా ఇచ్చిన విజయంతో దిల్ రాజుగా పేరు మార్చుకున్నారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి, పదుల సంఖ్యలో సినిమాలు నిర్మించి, సినీ రంగంలో అగ్ర నిర్మాతగా నిలిచారు. ఒకవైపు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా సినిమాలు నిర్మిస్తూనే.. మరొకవైపు సినీ రంగంలోకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహించడానికి ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో మరో కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిర్మాత గానే కాకుండా తెలంగాణ చలనచిత్ర, టీవీ, థియేటర్స్ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు.

ALSO READ:Adhira Movie: అధీర నుండి తప్పుకున్న ప్రశాంత్ వర్మ.. నిర్మాతకు ఆ కోటి నష్టమే ?

 

Related News

Tollywood Films: స్ట్రైక్ ఎండ్ అయితే సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ గా ఉన్న సినిమాలివే

Anushka Shetty: అనుష్క మార్కెట్ రూ. 25 కోట్లలోపే… యంగ్ హీరోయిన్ బెటర్ కదా..

Keerthy Suresh: Ai తెచ్చిన తంటా, ఏకంగా మహానటికే బట్టలు లేకుండా చేశారు

Mega Blast Glimpse : విశ్వంభర గ్లిమ్స్ అవుట్, ఇక ట్రోలింగ్ కు ఆస్కారమే లేదు

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Big Stories

×