Abhishek Bachchan: బాలీవుడ్ సినీ పరిశ్రమలో క్యూట్ కపుల్ గా పేరు సొంతం చేసుకోవడమే కాదు ఆదర్శ జంటగా కూడా నిలిచారు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan). వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకొని, ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అలాంటి ఈ జంటపై కొంతమంది తప్పుడు కథనాలు సృష్టించడం నిజంగా అభిమానులకే కాదు సినీ సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏమైందో తెలియదు కానీ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యపరిచాయి.
ఎంత స్పందించినా ఆగని రూమర్స్..
దీనికి తోడు అటు ఐశ్వర్యారాయ్ ఇటు అభిషేక్ బచ్చన్ ప్రవర్తించిన తీరుకు అందరూ నిజమనే అనుకున్నారు. అయితే ఏ కారణాల చేత వీరు వేరువేరుగా ఆయా సందర్భాలలో ఉండాల్సి వచ్చిందో తెలియదు కానీ ఇలా వేరుగా ఉండడం వల్లే విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తలు మరింత గుప్పుమన్నాయి. అయితే ఇలా రోజురోజుకి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అటు ఐశ్వర్యరాయ్ ఇటు అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా పరోక్షంగా స్పందించే ప్రయత్నం చేశారు. అయినా సరే రూమర్స్ మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి.
ఇకపై జీవితంలో ఆమె చెప్పిన మాటనే వింటాను – అభిషేక్
దీనికి తోడు అభిషేక్ బచ్చన్ ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పెట్టిన పోస్ట్ మళ్ళీ అనుమానాలకు తెరలేపింది. ఇక దీంతో వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రాగా.. ఇప్పుడు ఒక్క మాటతో అందరి నోరు మూయించారు అభిషేక్ బచ్చన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఇక నేను లెక్క చేయను. ఎవరు ఏమనుకున్నా ఆమెను మాత్రమే నేను ఫాలో అవుతాను అంటూ ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ..” నేను, నా భార్య ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకోబోతున్నాము అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెగటివ్ వార్తల గురించి ఆలోచించకపోతే తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపించలేవు. ఇక పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని నాకు నా భార్య ఐశ్వర్యరాయ్ సలహా ఇచ్చింది. ఇక ఇప్పటికీ ఎప్పటికీ నేను ఇదే ఫాలో అవుతాను. ఇక ఎవరు ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసినా డోంట్ కేర్” అంటూ అభిషేక్ బచ్చన్ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే అభిషేక్ బచ్చన్ విడాకులపై స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పటికైనా రూమర్స్ ఆగిపోతాయేమో చూడాలి.
ఐశ్వర్యరాయ్ – అభిషేక్ బచ్చన్ ప్రేమ, పెళ్లి..
‘ధూమ్ 2’ సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్యరాయ్ తో అభిషేక్ బచ్చన్ ప్రేమలో పడ్డారు. ఇక పెద్దలను ఒప్పించి 2007 జనవరి 14న నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక తర్వాత 2007 ఏప్రిల్ 20వ తేదీన బంట్ కమ్యూనిటీ, సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవడం జరిగింది. అంతేకాదు ఈ వివాహం ముంబైలోని జుహూ ఏరియాలో అమితాబ్ బచ్చన్ నివాసం ప్రతీక్ష లో ఒక ప్రైవేటు వేడుకలా జరిగింది.
ALSO READ:Uppu Kappurambu : కీర్తి సురేష్ 28 రోజుల ప్రయోగం.. ఓటీటీ అయినా దెబ్బ తప్పదా ?