BigTV English

Uppu Kappurambu : కీర్తి సురేష్ 28 రోజుల ప్రయోగం.. ఓటీటీ అయినా దెబ్బ తప్పదా ?

Uppu Kappurambu : కీర్తి సురేష్ 28 రోజుల ప్రయోగం.. ఓటీటీ అయినా దెబ్బ తప్పదా ?

Uppu Kappurambu :ఒకప్పటి హీరో హీరోయిన్లు ఒక ఏడాదిలో దాదాపు 10,15 సినిమాల్లో నటించేవారు. స్టార్ హీరో హీరోయిన్లు అయితే మూడు షిఫ్టులు, నాలుగు షిఫ్టుల్లో కూడా పని చేసేవారు. అలా ఒక్క ఏడాదిలో దాదాపు స్టార్ హీరో, హీరోయిన్ల సినిమాలు 10,15 విడుదలయ్యేవి. ఇక షూటింగ్ సమయం కూడా చాలా తక్కువగా ఉండేది. రెండు మూడు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్ చేసేవారు. కానీ ఇప్పుడు సినిమా షూటింగ్ ల కోసం ఎంత సమయం కేటాయిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క సినిమాకు అయితే ఏకంగా నాలుగైదు సంవత్సరాలు తీసుకుంటున్నారు.


ఇక రాజమౌళి(Rajamouli) లాంటి డైరెక్టర్ తన ఒక్కో సినిమాకి దాదాపు మూడు నుండి నాలుగు సంవత్సరాలు కచ్చితంగా టైం కేటాయిస్తారు. ఇక ఆయన డైరెక్షన్లో సినిమా చేసే ఏ హీరో అయినా.. మిగతా సినిమాలు పక్కన పెట్టాల్సిందే. ఈ విషయం పక్కన పెడితే.. షూటింగ్ కి రెండు మూడు సంవత్సరాలు కేటాయిస్తున్న ఇప్పటి జనరేషన్లో కూడా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించిన మూవీ కేవలం 28 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ అయిందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

28 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఉప్పుకప్పురంబు..


అయితే ఈ విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.. సుహాస్ (Suhas), కీర్తి సురేష్ కాంబోలో వస్తున్న ఉప్పుకప్పురంబు సినిమా (Uppukapourambu Movie)షూటింగ్ కేవలం 28 రోజుల్లోనే పూర్తయినట్టు కీర్తి సురేష్ తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే ఈ సినిమా కోసం 20 రోజులు సుహాస్,18 రోజులు కీర్తి సురేష్ టైం కేటాయించారట. అలా దాదాపు 28 రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తయిందట. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ మీడియాలో జూలై 4న విడుదల కాబోతోంది..

ఈ సినిమా వర్కౌట్ అయ్యేనా?

అయితే తాజాగా ఈ విషయం కీర్తి సురేష్ బయట పెట్టడంతో చాలామంది నెటిజెన్లు రెండు మూడు సంవత్సరాలు తీసిన సినిమాలే వర్కౌట్ అవ్వడం లేదు. అలాంటిది 28 రోజుల్లో షూటింగ్ ముగించారు అంటే సినిమా వర్కౌట్ అవుతుందా..? అసలు ఈ సినిమాని ఇంత తొందరగా ఎందుకు ముగించారు..? ఓటిటిలో రిలీజ్ అని ఈ సినిమా షూటింగ్ విషయంలో లైట్ తీసుకున్నారా.. ? 28 రోజుల్లో షూటింగ్ ముగిస్తే అవుట్ పుట్ ఎలా ఉంటుంది..? 28 రోజులు అంటే చాలా తక్కువ సమయం.. కాబట్టే కీర్తి సురేష్ ఈ సినిమాను ఒప్పుకుందా..? ఎందుకు ఈ సినిమా షూటింగ్ విషయంలో ఇంత నెగ్లెట్ గా ఆలోచించారు? కీర్తి సురేష్ 28 రోజుల ప్రయోగం ఫలిస్తుందా..? ఓటిటిలో విడుదల చేసిన దెబ్బ తప్పేలా లేదే? అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఆ సినిమాతో పోలుస్తూ కీర్తి సురేష్ కి అండగా ఫ్యాన్స్..

ఇక మరికొంత మందేమో సినిమా ఎన్ని రోజుల్లో ముగించామనేది కాదు.. వర్కౌట్ అయ్యిందా లేదా అనేది చూడాలి. ఉప్పుకప్పురంబు 28 రోజుల్లో షూటింగ్ అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మరి చిరంజీవి (Chiranjeevi) నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(Intlo Ramayya Veedhilo Krishnayya) సినిమా 29 రోజుల్లోనే షూటింగ్ ముగించుకొని 500 రోజులు ఆడలేదా అంటూ మరికొంతమంది ఉప్పుకప్పురంబు సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ సినిమా ఎలా ఉంది అనేది చూడాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక సుహాస్ ఇప్పటివరకు మంచి కంటెంట్ లు ఉన్న సినిమాలే ఎంచుకున్నారు కాబట్టి ఉప్పుకప్పురంబు సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు.

ALSO READ:Rajeev Kanakala: గుడ్డిగా నమ్మి మోసపోయాను.. కొడుకు సినిమాపై రాజీవ్ కనకాల ఊహించని కామెంట్స్!

Related News

OTT Movie : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

Big Stories

×