Ahmedabad News: సోషల్‌మీడియా వచ్చిన తర్వాత యువతకు మాంచి ఉత్సాహం వచ్చింది. వారి టాలెంట్ బయటపెట్టేందుకు ఇదొక వేదిక. అతి చేస్తే బుక్కైన వాళ్లు లేకపోలేదు. అలాంటి కోవలోకి చెందింది ఈ మహిళ. సోషల్ మీడియాలో తన టాలెంట్‌ని ఉపయోగించుకుని ఓ బిల్డర్‌ని హనీట్రాప్ చేసి అడ్డంగా పోలీసులకు చిక్కింది. ఎవరు? ఏంటి? ఎక్కడ? అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.
పైన కనిపిస్తున్న మహిళ పేరు కీర్తి పటేల్. సొంతూరు గుజరాత్. వృతి.. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. అంతకుమించి చెప్పాలంటే.. మేకప్ వేసుకునే ఆమెకి మించిన అందగత్తె మరొకరు ఉండరు. అనే విధంగా తయారవుతుంది. ఎలాంటివారైనా కీర్తి ట్రాప్‌లో పడాల్సిందే. ఆ విధంగా వ్యక్తులను ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది.. చేస్తోంది కూడా.
లక్షల్లో ఫాలోవర్స్ ఆమె సొంతం. తన ఇమేజ్‌ని రెట్టింపు చేసుకోవాలనే ఆలోచనలోపడి అడ్డంగా దొరికిపోయింది. సూరత్‌కు చెందిన ఓ బిల్డర్‌ని హనీట్రాప్ చేసింది కీర్తి పటేల్. అతడ్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ కోట్లాది రూపాయలు డిమాండ్ చేసింది. ఈమె కోసం పది నెలలుగా పోలీసులు గాలింపు చేపట్టారు.
చివరకు అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడింది. కీర్తితోపాటు మరో నలుగురిపై కేసులు ఉన్నాయి. కీర్తిపై భూకబ్జాలు, బెదిరింపులు, డబ్బు వసూలు చేయడం వంటి ఆరోపణలతో కూడిన కేసులున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా వెల్లడించారు. ఆమెపై సూరత్ కోర్టు వారెంట్ సైతం జారీ చేసింది.
ALSO READ: ఏకాంత సేవలో ప్రియుడితో భార్య, కోపంతో తట్టుకోలేక ముక్కు కొరికేసిన భర్త
వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఫోన్‌లో తరచూ సిమ్ కార్డులు మార్చడం ఈమెకి అలవాటు. ఈ క్రమంలో పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పుడు తప్పించుకునేది. బుధవారం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ ప్రాంతంలో కీర్తి ఆచూకీని గుర్తించారు సూరత్ పోలీసులు. స్థానిక పోలీసుల సహకారంతో కీర్తిపటేల్‌ని అరెస్టు చేశారు.
గడిచిన 10 నెలలుగా కీర్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు అహ్మదాబాద్ డీసీపీ అలోక్ కుమార్. టెక్నికల్ టీమ్, సైబర్ నిపుణుల సహాయంతో అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్‌లో ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. భూకబ్జాలు, హనీట్రాప్, బెదిరించి డబ్బు డిమాండ్ చేయడం వంటి ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.
గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో నిరంతరం తన ఆచూకీ మార్చుకుంటూ వచ్చి పట్టుబడిందన్నారు. ఈమె లొకేషన్ ట్రేస్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌తో సమన్వయం చేశామన్నారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతామని చెప్పారు. ఎవరైనా ఆమె వల్ల బెదిరింపులు ఎదుర్కొంటుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వస్తాయో చూడాలి.