BigTV English

Ananthika Sanil Kumar: వామ్మో అనంతికకి ఇంత చిన్న చెల్లెలు ఉందా.. మరో రష్మిక కానుందా?

Ananthika Sanil Kumar: వామ్మో అనంతికకి ఇంత చిన్న చెల్లెలు ఉందా.. మరో రష్మిక కానుందా?

Ananthika Sanil Kumar: అనంతిక సనీల్ కుమార్ (Ananthika Sanil Kumar).. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా అనంతిక గురించే ఎక్కువగా వినిపిస్తోంది. అనంతిక ఒక హీరోయిన్ మాత్రమే కాదు.. మల్టీ టాలెంటెడ్ కూడా.. ఆమె టాలెంట్ చూసి సినీ పరిశ్రమ మొత్తం నివ్వరపోతోంది. 19 ఏళ్లకే ఏ ఒక్కరు సొంతం చేసుకోని అరుదైన టాలెంట్ ను తన సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ‘ 8 వసంతాలు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జూన్ 18వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్లో తన టాలెంట్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా బయటపెట్టి, అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో అనంతికపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 19 ఏళ్లకే ఇంత టాలెంటా? ఇక భవిష్యత్తులో కచ్చితంగా ఎవరు సాధించని రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.. అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


వైరల్ గా మారిన అనంతిక చెల్లెలు ఏజ్..

ఇకపోతే అనంతిక ఫ్యామిలీ విషయానికి వస్తే.. ఈమెకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం అనంతిక పేరు బయటకు రావడంతో ఈమె ఇంస్టాగ్రామ్ ఐడీ ను కూడా చాలామంది సెర్చ్ చేస్తున్నారు. అందులో అనంతిక ఒక చిన్న పాపతో ఎక్కువగా స్పెండ్ చేసినట్లు,అందుకు సంబంధించిన ఫోటోలు కూడా మనం చూడవచ్చు. అయితే అక్కడున్నది ఎవరో కాదు అనంతిక చెల్లెలు. ఏంటీ.. నిజమా..? అని ఆశ్చర్యపోతున్నారు కదా.. మీరు విన్నది నిజమే.. 19 సంవత్సరాల అనంతికకి ఇంత చిన్న చెల్లెలు ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది కూడా.


అనంతిక – అనంతిక చెల్లెలి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?

తాజాగా 8 వసంతాలు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అనంతిక తన చెల్లి గురించి ఓపెన్ అయింది. ప్రస్తుతం తన చెల్లి నాలుగవ తరగతి చదువుతోంది అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ విషయం విని ఇంత చిన్న చెల్లెలు ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అనంతిక లాగే ఈమె చెల్లెలు కూడా చాలా క్యూట్ గా ఉంది అని పలువురు అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య 10 సంవత్సరాల వయసు తేడా ఉన్నట్లు సమాచారం.

also read: Satya Sri: నా భర్తే కావాలంటోంది.. ఆమె వల్లే పెళ్లికి దూరం అంటున్న సత్య శ్రీ!

అనంతిక మరో రష్మిక కానుందా..?

ఇకపోతే అనంతికకి నాలుగవ తరగతి చదివే చెల్లెలు ఉందని తెలియడంతో అనంతిక మరో రష్మిక మందన్న (Rashmika mandanna) కానుందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే అటు రష్మిక కి కూడా చాలా చిన్న చెల్లెలు ఉంది. ఎంత అంటే వీరిద్దరి మధ్య ఏకంగా 16 సంవత్సరాల తేడా. ఇటు అనంతిక – అనంతక చెల్లెలి మధ్య కూడా దాదాపు 10 సంవత్సరాల వయసు తేడా ఉంది. అందుకే అనంతిక మరో రష్మిక కానుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు ఈమెకు చాలా టాలెంట్ ఉంది. పైగా సినిమాలలో కొనసాగితే.. రష్మిక లాగే ఈమె కూడా పాన్ ఇండియా స్టార్ స్టేటస్ సొంతం చేసుకుని అవకాశం కనిపిస్తుంది.

సినిమాలు వద్దు..పాలిటిక్స్ ముద్దు – అనంతిక

అయితే ఈమెకు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడం ఇష్టం లేదని, పాలిటిక్స్ లోకి వెళ్లడం ఇష్టమని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా అనంతికకి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×