Rajinikanth : తమిళ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కూలి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.. నాగార్జున కూడా కీలకపాత్రలో నటించడంతో దీనికి తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ మూవీ కోసం అటు రజినీ ఫ్యాన్స్, ఇటు నాగార్జున ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ కి బ్యాడ్ న్యూస్.. రజినీకాంత్ కు కిందపడి గాయాలు అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
రజినీ ఇంట్లో ప్రమాదం, గాయాలు..
తాజాగా రజనీకాంత్ ఇంట్లో ప్రమాదం జరిగిందని ఓ వార్త అయితే బయటకు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో రజనీకాంత్ తన ఇంట్లోంచి బయటికి వెళ్తూ ఉంటాడు. మళ్లీ ఆయన పేపర్ తీసుకొని ఇంట్లోకి వస్తున్న సందర్భంలో కాలుజారి కింద పడతాడు. ఈ క్రమంలో ఆయనకు నడుము దగ్గర బెనికిందంటూ వార్త వినిపిస్తుంది. మరోవైపు ఆయన గడ్డిలో పడ్డాడేమో గాయాలు ఏమి తగల్లేదులే అని వాదన వినిపిస్తుంది.. ఆ వీడియోని చూస్తుంటే మాత్రం రజనీకాంత్ కింద పడ్డట్టు తెలుస్తుంది. మరి గాయాలయ్యాయో లేదో తెలియాలంటే రజిని టీం క్లారిటీ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాలి..
Also Read : అనుష్క ‘ఘాటి ‘ మళ్లీ వాయిదా.. రిలీజ్ ఎప్పుడంటే..?
కూలీ మూవీ..
జైలర్ తర్వాత రజనీ నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ లు నటిస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు.. ఈ సినిమాను మొత్తం 350 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. మరి ఫైనల్ గా ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఈ మూవీ పై రజినీ కాంత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.. దీని తర్వాత మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నారని సమాచారం..
Please @rajinikanth Take care Ur Self Sir #Coolie pic.twitter.com/TC6pCPByLz
— Boomer Uncle 🥸🥸 (@cinemakaran007) July 29, 2025