Akshay Kumar: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar)ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అక్షయ్ కుమార్ సినిమాలకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా అక్షయ్ కుమార్ తన ఆస్తులను వరుసగా అమ్ముతున్న నేపథ్యంలో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ గత 7 నెలల కాలంలో సుమారు 8 ఆస్తులను అమ్మినట్టు తెలుస్తుంది. ఇలా ఈయన అమ్మిన ఈ ఆస్తుల విలువ సుమారు 110 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఇకపోతే తాజాగా మరో రెండు ఆస్తులను కూడా అమ్మినట్టు తెలుస్తోంది.
92% ఆదాయం..
అక్షయ్ కుమార్ ముంబైలోని బోరివాలి తూర్పు ప్రాంతంలో పక్కనే ఉన్న రెండు నివాస అపార్ట్‌మెంట్‌లను ₹ 7.10 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆస్తులను అక్షయ్ కుమార్ 2017లో ₹ 3.69 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఈయన ఈ ఆస్తులపై ఏకంగా 92% ఆదాయాన్ని అందుకున్నారని తెలుస్తోంది. ఈ రెండు అపార్ట్‌మెంట్‌లు ఒబెరాయ్ స్కై సిటీ అనే భవనంలో ఉన్నట్లు ఈ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది. ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రకారం..
ప్రవీణ్ శెట్టి.. సబితా శెట్టి..
అక్షయ్ కుమార్ తన మొదటి అపార్ట్మెంట్ ను ₹ 5.75 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. ఈ అపార్ట్మెంట్
1,101 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో పాటు రెండు కారు పార్కింగ్ సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఆస్తికి సంబంధించి రూ. 34.50 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈయన తన రెండవ అపార్ట్మెంట్ విషయానికి వస్తే ఈ అపార్ట్మెంట్ 252 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఈ అపార్ట్మెంట్ ను ఈయన ₹ 1.35 కోట్లకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇలా అక్షయ్ కుమార్ కి చెందిన ఈ రెండు ఫ్లాట్లు కూడా ప్రవీణ్ శెట్టి(Praveen Shetty) సబితా శెట్టి(Sabita Shetty)లకు విక్రయించినట్టు సంబంధిత డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది.
భారీగా లాభాలు..
ఈ రెండు ఆస్తులకు సంబంధించి అక్షయ్ కుమార్ 2017లో కొనుగోలు చేశారు అయితే ఈ రెండు ప్రాపర్టీస్ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తున్న నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ అమ్మినట్టు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సెలెబ్రిటీలు దాదాపు అందరూ కూడా ఇలాగే ఆస్తులను కొనుగోలు చేసి వాటిని భారీ లాభాలకు అమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అక్షయ్ కుమార్ కూడా భారీ లాభాలు వస్తున్న నేపథ్యంలోనే తన రెండు విలువైన అపార్ట్మెంట్లను అమ్మినట్టు తెలుస్తుంది. అక్షయ్ కుమార్ సినిమాల విషానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇటీవల హౌస్ ఫుల్ 5 అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమెతో నటించాలనుందంటూ!