BigTV English

AP CM Singapore Visit: ఏపీ వైపు చూడండి.. అన్నీ అద్భుతాలే.. సింగపూర్‌లో సీఎం!

AP CM Singapore Visit: ఏపీ వైపు చూడండి.. అన్నీ అద్భుతాలే.. సింగపూర్‌లో సీఎం!

AP CM Singapore Visit: అనంతపురం నుంచి అమరావతి వరకు రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇప్పుడు ఆ ఆభివృద్ధి పాఠాలు సింగపూర్ వరకూ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న నాయకుడిగా చంద్రబాబు మరోసారి చరిత్రలో మెరిసిపోతున్నారు. సింగపూర్‌లో తెలుగు పేరు మార్మోగించేశారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం, అక్కడ ఏం చేశారు? ఏం సాధించారో తెలుసుకుందాం.


పెట్టుబడులకు కేంద్రం..
ఏపీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యంగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా, సింగపూర్‌లో నిర్వహించిన ఏపీ-సింగపూర్ బిజినెస్ ఫోరమ్ రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. పెట్టుబడులే కాదు, పేదల అభివృద్ధికీ తోడ్పడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం
సింగపూర్‌లో జరిగిన రోడ్ షో కార్యక్రమానికి సింగపూర్ కంపెనీల ప్రతినిధులు, ఏపీ అధికారులతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యంతో రూపొందించిన ప్రణాళికలపై వ్యాసంగా వివరించారు.


అవినీతి రహిత దేశం అంటూ..
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 2014లో అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ వెళ్లినప్పుడు, ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఇచ్చారు. కానీ గత ఐదేళ్లలో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పర్యటన ద్వారా వాటిని పునరుద్ధరించేందుకు ముందడుగు వేస్తున్నాం. సింగపూర్ అవినీతి రహిత దేశం కావడంతో, అక్కడి పెట్టుబడులకు అత్యంత భద్రత ఉన్నదిగా భావిస్తామన్నారు.

ఏపీలో అవకాశాలు ఎక్కువ..
ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు – విశాఖ-చెన్నై, బెంగుళూరు-హైదరాబాద్, బెంగుళూరు-చెన్నైలు ఉన్నాయని తెలిపారు. ఇందులో పెట్రో కెమికల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమలకు విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతి లాజిస్టిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తూ పెట్టుబడి దారులకు అవసరమైన వర్క్ ఫోర్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

Also Read: Railway route changes: ఆగస్ట్ లో భారీగా ట్రైన్స్ రూట్ మార్పు.. మీ స్టేషన్ ఉందేమో చెక్ చేసుకోండి!

గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ మొబిలిటీ, డేటా సెంటర్లు, స్టార్టప్ పాలసీలు, డిఫెన్స్, స్పోర్ట్స్, టెక్స్‌టైల్ రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలున్నాయని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు ఆపరేషనల్ పోర్టులు, ఏడున్నర ఎయిర్ పోర్టులు ఉన్నాయని, త్వరలో మరో నాలుగు పోర్టులు, తొమ్మిది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

నగరాలన్నీ.. సింగపూర్ ను మించి నిర్మిస్తాం
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం 24 థీమాటిక్ పాలసీలు రూపొందించామని, సర్క్యులర్ ఎకానమీ, తక్కువ వ్యయంతో రవాణా వంటివి లక్ష్యంగా తీసుకుని వెళ్తున్నామన్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని, నగర నిర్మాణంలో సింగపూర్ తరహాలో ఆధునిక పద్ధతులు అమలుచేస్తున్నామని చెప్పారు.

స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంలో భాగంగా తిరుపతి, అనంతపురం, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ విధానం ద్వారా MSME రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

సింగపూర్ – ఏపీ స్టార్టప్ ఫెస్టివల్ నిర్వహణకు సిద్ధమని సీఎం పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు ఇది గొప్ప వేదికగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సులో సింగపూర్ కంపెనీలు పాల్గొనాలని, పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకోవాలని పిలుపునిచ్చారు. గ్లోబల్ స్థాయిలో పోటీతత్వం ఉన్న, ఇన్నోవేషన్ ఆధారిత సమాజంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని పేర్కొంటూ, పెట్టుబడులకు సురక్షితమైన గమ్యంగా రాష్ట్రాన్ని రూపొందించనున్నట్టు తెలిపారు. భారత తూర్పు తీరానికి గేట్‌వేగా ఏపీని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×