Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని పూర్తిస్థాయిలో రాజకీయ నాయకుడిగా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈయన డిప్యూటీ సీఎం కాకముందు కమిట్ అయిన సినిమాలను ఇటీవల పూర్తి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల బాధ్యతలను హీరోయిన్ నిధి అగర్వాల్ తీసుకొని సినిమాకు కావాల్సినంత ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే చివరి మూడు రోజులు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొని పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
కంగనాకు ప్రాధాన్యత ఇచ్చిన పవన్ …
ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా బాలీవుడ్ హీరోయిన్ల గురించి ప్రశ్నలు ఎదురవడంతో పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన సమాధానాలను తెలియజేశారు. ఇందులో భాగంగా యాంకర్ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తూ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటూ కొంతమంది హీరోయిన్ల పేర్లను తెలియజేశారు అందులో అలియా భట్, దీపికా పదుకొనే, కియారా అద్వానీ, కృతి సనన్ వంటి వారి పేర్లను చెప్పడంతో పవన్ కళ్యాణ్ వీరందరితో కలిసి సినిమాలలో నటించాలని ఉందని తెలియజేశారు. అయితే కృతి సనన్, కంగనా రౌనత్(Kangana Ranaut) ఇద్దరిలో ఎవరు అంటే ఇష్టం ఎవరితో నటించాలని ఉంది అనే ప్రశ్న కూడా ఎదురయింది.
శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్…
ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతూ కంగనా రనౌత్ ఇష్టమని తెలిపారు. ఇలా ఈమెకు ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాన్ని కూడా పవన్ కళ్యాణ్ తెలియ చేశారు. ఇటీవల కంగనా ప్రముఖ రాజకీయ నాయకురాలు ఇందిరా గాంధీ బయోపిక్ (Indiragandhi Biopic)సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఎంతో అద్భుతంగా నటించిందని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఇక కంగనా, శ్రీదేవి(Sridevi) పేర్లు చెప్పడంతో తనకు ఆల్వేజ్ శ్రీదేవి ఫేవరెట్ హీరోయిన్ అని తెలియ చేశారు.
విడుదలకు సిద్ధమవుతున్న ఓజీ…
ఇలా పవన్ కళ్యాణ్ ఫేవరెట్ హీరోయిన్ సీనియర్ నటి శ్రీదేవి అని తెలియడంతో ఆమె అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీదేవి కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే కాకుండా ఎంతో మంది హీరో హీరోయిన్ల అభిమాన నటిగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలోనూ వందల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే శ్రీదేవి అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కూడా శ్రీదేవి తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే ఈయన నటించిన ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Sanjay Dutt: 72 కోట్ల ఆస్తిని ఆ హీరోకు రాసిచ్చిన అభిమాని… హీరో రియాక్షన్ ఇదే!