E-Paper
Advertisement

రఘువరన్ మృతికి కొడుకే కారణమా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన బాలాజీ!

రఘువరన్ మృతికి కొడుకే కారణమా.. విస్తుపోయే నిజాలు బయటపెట్టిన బాలాజీ!
Advertisement

Actor Balaji: రేపుల బాలాజీగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బాలాజీ అటు సీరియల్స్ లో తండ్రి, అన్న పాత్రలు పోషిస్తూ.. బుల్లితెర ఆడియన్స్ కు దగ్గర అయి.. ఇటు సినిమాలలో విలన్ పాత్రలతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలాజీ 67 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల కుర్రాడిలా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఇదే ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్న ఆయన.. నా చెల్లెలు రోహిణి భర్త ప్రముఖ యాక్టర్ రఘువరన్ మృతికి తన కొడుకే కారణం అంటూ విస్తుపోయే నిజాలు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.

రఘువరన్ మరణానికి కారణం కొడుకే – నటుడు బాలాజీ

చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ అనూహ్య గుర్తింపును సొంతం చేసుకున్న రఘువరన్.. శివ, పసివాడి ప్రాణం, బాషా , సుస్వాగతం వంటి తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు సుపరిచితమైన ఈయన 2008లో వచ్చిన ఆటాడిస్తా లో చివరిగా నటించి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇలా మరణించడానికి కారణం ఆయన కొడుకే అంటూ ప్రముఖ నటుడు బాలాజీ ఇటీవల చెప్పుకొచ్చారు..

Advertisement

also read:ఆ సంఘటన నన్ను మార్చేసింది.. విలన్ పాత్రల ప్రభావంపై బాలాజీ ఊహించని కామెంట్స్!

కలిసి జీవించడం ఇష్టం లేనప్పుడు.. ఎన్ని చేసినా విఫలమే – బాలాజీ

బాలాజీ మాట్లాడుతూ.. నా చెల్లెలు రోహిణి, రఘువరన్ ఇద్దరు ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు పుట్టారు రిషి వరన్. కొడుకు అంటే అమితమైన ఇష్టం. సవ్యంగా సాగుతున్న రోహిణి – రఘువరన్ మధ్య ఎన్నో విభేదాలు వచ్చాయి. విడిపోవాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణం చేత వారిని కలిపే వాళ్ళం. ఇక ఒకసారి ఇద్దరు కలిసి తిరుపతికి వెళ్లి గుండు కూడా గీయించుకున్నారు. తమ వైవాహిక బంధం సవ్యంగా సాగాలనీ.. కానీ విధిరాతను ఎవరూ తప్పించలేరు.. రఘువరన్ మధ్యానికి బానిసవ్వడం, ఆ తర్వాత రఘువరన్ నుండి రోహిణి విడిపోవడం అన్నీ జరిగిపోయాయి.

బిడ్డ దగ్గర లేడనే బాధతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు..

Advertisement

ముఖ్యంగా కలిసి ఉండాలి అనే ఆలోచన అమ్మాయిలో ఉండాలి. అది లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు. దారాన్ని తెంపడం సులభం.. కానీ దానిని అతికించడం ఆ బ్రహ్మ దేవుడి తరం కూడా కాదు.. ఇక కొడుకును తీసుకొని రోహిణి వెళ్ళిపోయింది. కొడుకు అంటే అమితంగా ఇష్టపడే రఘువరన్ రక్తం పంచిన బిడ్డ తన కళ్ళ ఎదుట లేడనే బాధ ఎక్కువైపోయి ఆ బాధతోనే మరణించాడు. అలా కొడుకు కోసం పరితపించి రఘువరన్ చనిపోయాడు” అంటూ అసలు విషయాన్ని బయటపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు బాలాజీ. మొత్తానికైతే కొడుకు తన దగ్గర ఉండుంటే ఆయన ఇప్పటికీ జీవించి ఉండేవాడని డ్రగ్స్ కు బానిస అయ్యాడు అనే మాటలు ఆ వాస్తవమని బాలాజీ తెలిపారు.

చైల్డ్ ఆర్టిస్ట్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు..

రోహిణి విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, టీవీ వ్యాఖ్యాతగా, రచయితగా , సామాజిక కార్యకర్తగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు . పలు భాషల్లో నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె..ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే.. మరొకవైపు అత్త, అమ్మ , వదిన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికీ కథ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు రోహిణి.

Related News

ఆడవాళ్లే ఆడవాళ్లను ఎందుకంటే ..శ్రావణ భార్గవి షాకింగ్ కామెంట్స్!

అంజి మామకు బిగ్ షాక్.. రూ.23 లక్షలు పోయాయట!

విజయ్ పక్కన త్రిష.. విమర్శలకు సంజనా గల్రాని దిమ్మతిరిగే ఆన్సర్!

థియేటర్లకు షాక్.. టికెట్ ధరలపై సర్కార్ కొత్త లెక్క!

వెంకీ–కళ్యాణ్ రామ్ మూవీ.. రిలీజ్ డేట్‌నే టైటిల్‌గా పెట్టేశావు కదయ్యా అనీలూ!

సుమలత ఏకపక్ష నిర్ణయం.. జానీ మాస్టర్ కి ఫిలిం ఫెడరేషన్ ఊహించని షాక్!

మరో లేడీ అభిమాని కోరిక తీర్చిన రామ్ పోతినేని.. వీడియో వైరల్!

అఖండ-2, పెద్ది సినిమాలకు కొత్త రూల్‌.. 20% ఇవ్వాల్సిందే !

Big Stories

Advertisement
×