Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా పుష్ప(Pushpa) సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఎంతో మంచి గుర్తింపు పొందిన బన్నీ ఇటీవల పుష్ప 2తో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ గా బన్నీ..
ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీ(Atlee) దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బన్నీ ఇటీవల కాలంలో తరచూ వివాదాలలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ టాలీవుడ్ సీనియర్ నటుడు బన్నీ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందిన జెన్నీ(Jenny) పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
కొడితే కళ్ళజోడు విరిగిపోయింది..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జెన్నీ అల్లు అర్జున్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి (s/o Sathyamurthi)సినిమాలో అల్లు అర్జున్ ఇంటి ఓనర్ గా జెన్నీ నటించారు. ఈ సినిమాలో తండ్రి పోగొట్టుకొని ఆస్తులన్నీ కోల్పోయిన బన్నీ చాలా ఓపికతో కనిపిస్తారు. అనంతరం చాలా కోపిష్టిగా మారిపోతూ ఉంటారు. ఇలా కోపిష్టిగా మారిన సమయంలో జెన్నీ ను కొట్టే సన్నివేశం ఒకటి ఉంది. అయితే ఆ సమయంలో నిజంగానే ఆయన చేయి తగిలి తన కళ్ళజోడు(spectacles) విరిగిపోయినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా జెన్నీ తెలియచేశారు. ఇలా నా కళ్ళజోడు విరిగిపోగానే వెంటనే తన మేనేజర్ ని పిలిచి నాకు కళ్ళజోడు తెప్పించమని చెప్పారు.
ప్రతి సినిమాలో అవకాశం …
నా కళ్ళజోడు విరిగిపోవడంతో పర్లేదు అని చెప్పిన బన్నీ వినలేదు. నేను మిమ్మల్ని చిన్నప్పటినుంచి చూస్తున్నాను, మీరు ఎంతో అనుభవం ఉన్ననటుడు పొరపాటున నా చెయ్యి తగిలింది కళ్ళజోడు వద్దని చెప్పకండి అంటూ కళ్ళజోడు తెప్పించారు. నేను మీరు తెప్పించే కళ్ళజోడు తీసుకోవాలంటే నాకు ఒక మాట ఇవ్వాలని అడిగాను. మీ ప్రతి ఒక్క సినిమాలో నాకు ఒక చిన్న పాత్రలో అవకాశం ఇవ్వండి అని చెప్పుగా… తప్పకుండా ఉంటుంది అంటూ బన్నీ మాట ఇచ్చినట్లు జెన్నీ తెలిపారు. ఇలా ఆయన నా వయసుకు గౌరవాన్ని ఇస్తూ నాకు కళ్ళజోడు తెప్పించడం నిజంగా గర్వించదగ్గ విషయం అంటూ ఈ సందర్భంగా బన్నీ గురించి జెన్నీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తదుపరి సినిమాలలో ఈయన పెద్దగా కనిపించలేదని చెప్పాలి. బహుశా ఆయన వయసుకు తగ్గ పాత్రలు లేకపోవడం వల్లే అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది.
Also Read: Sreeleela Remuneration: సరైన హిట్లు లేవు… రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన శ్రీ లీల.. షాక్ లో నిర్మాతలు?