Sreeleela Remuneration: టాలీవుడ్ ఇండస్ట్రీకి పెళ్లి సందD అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమయ్యారు యంగ్ బ్యూటీ శ్రీ లీల. మొదటి సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన ఈమె నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీ లీలకు తెలుగులో అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. తెలుగులో ధమాకా (Dhamakha)సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈమె వరుసగా అరడజనకు పైగా సినిమాలలో నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే ఈ సినిమాలలో ఒకటి రెండు మినహా మిగిలిన సినిమాలు ఏవి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని చెప్పాలి.
వరుస ప్లాపులలో శ్రీ లీల..
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ సినిమాలను ఎదుర్కొంటున్న శ్రీ లీల ఇటీవల అల్లు అర్జున్ (Allu Arjun)నటించిన పుష్ప 2(Pushpa 2) సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సినిమా తర్వాత ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా రావడం మొదలయ్యాయి. ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. తెలుగులో ఈమె జూనియర్, ఉస్తాద్ భగత్ సింగ్, మాస్ జాతర వంటి సినిమాలలో నటిస్తున్నారు. తదుపరి బాలీవుడ్ ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఒక్కో సినిమాకు 7 కోట్ల రెమ్యూనరేషన్..
తాజాగా శ్రీ లీల రెమ్యూనరేషన్(Remuneration) కి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇటీవల కాలంలో ఈమె సరైన సక్సెస్ అందుకో లేకపోయినా రెమ్యూనరేషన్ మాత్రం భారీగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇదివరకు ఒక్కో సినిమాకు శ్రీ లీల 3.5 నుంచి 4 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అయితే ఒక్కసారిగా ఈమె తన రెమ్యూనరేషన్ 7 కోట్లకు పెంచడంతో నిర్మాతలు షాక్ అవుతున్నారు. ఇలా శ్రీ లీల భారీగా రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు మరొక హీరోయిన్ కోసం వేట ప్రారంభిస్తున్నారు. ఇక బాలీవుడ్ నిర్మాతలు మాత్రం ఈమె అడిగినది మొత్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు.
బాలీవుడ్ హీరోతో డేటింగ్…
ఏది ఏమైనా సరైన హిట్టు లేకపోయినా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక తెలుగులో ఈమె చివరిగా గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటీవల శ్రీ లీల బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే .అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరూ కలిసి జంటగా కనిపించడంతో వీరి రిలేషన్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక తెలుగులో శ్రీ లీల నటించిన మాస్ జాతర (Mass Jathara)సినిమా ఆగస్టు నెలలో విడుదలకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఇదివరకే రవితేజతో ధమాకా సినిమా ద్వారా హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ మాస్ జాతరతో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Fish Venkat -Vishwak: ఫిష్ వెంకట్ కు అండగా హీరో విశ్వక్.. టాలీవుడ్ ఇప్పుడు మేల్కొంటుందా?