Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం పరిచయం అవసరం లేని పేరు. సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలపై ఆసక్తితో చేస్తున్న ఉద్యోగం కూడా పక్కనపెట్టి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇండస్ట్రీలో కొనసాగాలని ప్రయత్నాలు చేస్తూ ఈయన రాజావారు రాణి గారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా పరచయమయ్యారు. మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న కిరణ్ అబ్బవరం తదుపరి పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈయన ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇటీవల కిరణ్ అబ్బవరం కే రాంప్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు . ఇలా ఈయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. కిరణ్ అబ్బవరం ‘క’ అనే సినిమాలో నటించడమే కాకుండా ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అలాగే ఈయన తిమ్మరాజు పల్లి టీవీ అనే సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కిరణ్ అబ్బవరం దర్శకుడిగా కూడా మారబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నారు.
నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం దర్శకుడిగా కూడా సక్సెస్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే కిరణ్ అబ్బవరం దర్శకుడిగా ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇప్పటికే కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా కూడా ఫైనల్ అయిందని ఈ సినిమాకు జాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సుధాకర్ చాగంటి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించబోతున్నారని సమాచారం. ఇలా హీరోగా సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం దర్శకుడిగా మారి స్వీయ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుందనే వార్తలు వైరల్ గా మారడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
చెన్నై లవ్ స్టోరీ..
ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారక ప్రకటన కూడా రాబోతోందని సమాచారం. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే ఈయన చెన్నై లవ్ స్టోరీ అనే సినిమాలో నటిస్తున్నారు.’మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం జోడిగా సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఒక వైపు నటుడిగా నిర్మాతగా కొనసాగుతూనే కిరణ్ అబ్బవరం దర్శకుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈయన మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read: Monalisa Bhosle: మోనాలిసాకు బిగ్ షాక్… ఫర్మాన్ ఖాన్ తో పెళ్లి చెల్లదంటూ!