BigTV English

Actor Madhavan: లగ్జరీ ఫ్లాట్ అద్దెకిచ్చిన మాధవన్… రెంట్ తెలిస్తే దిమ్మతిరిగి పోవడం ఖాయం?

Actor Madhavan: లగ్జరీ ఫ్లాట్ అద్దెకిచ్చిన మాధవన్… రెంట్ తెలిస్తే దిమ్మతిరిగి పోవడం ఖాయం?

Actor Madhavan: సినీ నటుడు మాధవన్ (Madhavan)సౌత్ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అద్భుతమైన ప్రేమ కథ సినిమాలలో నటిస్తూ ఒకానొక  సమయంలో అమ్మాయిల కలల రాకుమారుడిగా ఎంతోమంది లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ తెలుగు, తమిళ భాష చిత్రాలలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక మాధవన్ సినిమాలో ఎంపిక చాలా భిన్నంగా ఉంటుందని చెప్పాలి. సరికొత్త కథలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉండేవారు. ఇటీవల కాలంలో మాధవన్ హీరోగా సినిమాలను కాస్త తగ్గించారు.


ముంబైలో ఖరీదైన ఫ్లాట్…

ఇలా హీరోగా సినిమాలు చేయకపోయినా కథ ప్రాధాన్యత ఉంటే సపోర్టింగ్ పాత్రలలో నటించడానికి మాధవన్ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన సౌత్ సినిమాల కంటే కూడా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. మాధవన్ హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈయన చెన్నైలో మాత్రమే కాకుండా ముంబైలో(Mumbai) కూడా ఖరీదైన ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు సమాచారం.


బాంద్రా కుర్లా కాంప్లెక్స్…

బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఎక్కువగా సినిమాలలో సంపాదించింది మొత్తం ఇలా ఆస్తుల రూపంలోనే పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటులు ఎక్కువగా బాంద్రా ప్రాంతంలో ఖరీదైన లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోని మాధవన్ సైతం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ప్రీమియం లగ్జరీ ఫ్లాట్(Luxury Flat) కొనుగోలు చేయడమే కాకుండా దానిని అద్దెకు ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఈ ఫ్లాట్ నెల రెంటు (Rent)ఎంతో తెలిస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవడం ఖాయం. మాధవన్ ఈ లగ్జరీ ఫ్లాట్ ను నెలకు రూ.6.5 లక్షల అద్దెకు ఇచ్చినట్టు తెలుస్తుంది. సిగ్నియా పెర్ల్ రెసిడెన్షియల్ టవర్‌లో ఉన్న 4,182 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను భారతీయ అనుబంధ సంస్థ అయిన బీపీ ఎక్స్‌ప్లోరేషన్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చారు.

రూ.17.5 కోట్ల అద్దె..

ఇక ఈ లీజు రెండేళ్ల ఒప్పందం పాటు కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. జూన్ 11వ తేదీ 2025న లీజ్ కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈరెండేళ్ల కాలానికి మాధవన్ దాదాపు రూ.1.60 కోట్ల లాభం పొందుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ లీజుకు సంబంధించి మాధవన్ రూ.39 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ను కూడా అందుకున్నారట. ఇకపోతే ఈ విలాసవంతమైన భవనాన్ని మాధవన్ గత ఏడాది జూలైలో రూ.17.5 కోట్లకు ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయటం విశేషం. ఇలా ఈయన ఈ భవనం పై పెట్టిన పెట్టుబడి రెండు సంవత్సరాలలోనే ఆయనకు తిరిగి వస్తుందని చెప్పాలి.  ఇలా రెండు సంవత్సరాలకు ఏకంగా 17 కోట్లు అదే అందుకోబోతున్నారనే విషయం తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్న మాధవన్ రాజమౌళి సినిమాలో కూడా నటించే అవకాశం అందుకున్నారని తెలుస్తోంది. రాజమౌళి ఓ పాత్ర కోసం మాధవన్ ను సంప్రదించారని ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉందని తెలుస్తుంది.

Also Read:  Manchu Vishnu: దర్శకుడు పూరి పరువు తీసిన మంచు విష్ణు.. నువ్వు తోపా?

Related News

Hansika: భర్తకు విడాకులు.. సింగిల్ గా వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఇలా కన్ఫాం చేసిందా?

Ss Rajamouli: పవన్ కళ్యాణ్ సినిమాని కామెంట్ చేసిన రాజమౌళి, వైరల్ అవుతున్న పోస్ట్

MOWGLI : మొగ్లీ సినిమా కోసం రామ్ చరణ్, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు

Manchu Manoj: సినీ ఇండస్ట్రీలో తిమింగలాలు ఉన్నాయి.. దుమారం రేపుతున్న మనోజ్ కామెంట్స్!

DUDE First Gear: డ్యూడ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది, ఎక్సలెంట్ ఎనర్జీ

OG Film Story: ఓజి సినిమా కంప్లీట్ కథ ఇదే, హే సుజీత్ ఈ మాత్రం చాలయ్యా 

Big Stories

×