BigTV English

Goutham Gambhir: కోచ్ గా గంభీర్ పనికిరాడు.. అతని హయాంలో 5 దారుణమైన పరాజయాలు.. రంగంలోకి కొత్త కోచ్..BCCI భారీ స్కెచ్!

Goutham Gambhir: కోచ్ గా గంభీర్ పనికిరాడు.. అతని హయాంలో 5 దారుణమైన పరాజయాలు.. రంగంలోకి కొత్త కోచ్..BCCI భారీ స్కెచ్!

Goutham Gambhir: గతంలో భారత క్రికెట్ జట్టుకు అనేకమంది కోచ్ లుగా పనిచేశారు. కానీ గౌతమ్ గంభీర్ కి వచ్చినంత హైప్ మరెవరికి రాలేదు. భారత క్రికెట్ చరిత్రలో జట్టు కంటే కోచ్ ని ఎక్కువగా హైలైట్ చేసి మరీ చూపించే పద్ధతి గౌతమ్ గంభీర్ తోనే మొదలైందని చెప్పాలి. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టి-20 వరల్డ్ కప్ తో ముగియడంతో.. టీం ఇండియా నూతన కోచ్ గా గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు.


Also Read: Indian Team Captains: ధోని, రోహిత్ సక్సెస్.. గిల్ కు మాత్రం కోహ్లీ దరిద్రం… టీమిండియా వరుసగా ఓడిపోవడం ఖాయమైనా?

2024 జూన్ 27న శ్రీలంక పర్యటనతో మొదలైన టీమిండియా మూడు టి-20, 3 వన్డేల సిరీస్ లతో కోచ్ గా గంభీర్ ఇన్నింగ్స్ మొదలైంది. అయితే తను పగ్గాలు చేపట్టినప్పుడే తనదైన శైలిలో జట్టును నడిపించాలని గౌతమ్ గంభీర్ భావించాడు. కానీ సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్, బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఓటములు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కీ అర్హత సాధించకపోవడం అతని జోరుకు కళ్లెం వేశాయి.


ఇక ఇటీవల దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ శకం మొదలైందనే వాదన వినిపించింది. కోచ్ కంటే కూడా కెప్టెన్ టీం ఇండియాలో పవర్ ఫుల్ గా ఉన్న చరిత్ర ఉంది. కానీ “రో,కో” రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నూతన కెప్టెన్ గా గిల్ బాధ్యతలు చేపట్టడంతో గౌతీ తనదైన మార్పు చూపించే అవకాశం ఉందని భావించారు.

గిల్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 37వ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. కోచ్ గౌతమ్ గంభీర్, గిల్ నాయకత్వంలో యంగ్ టీం ఇండియా ఇంగ్లాండ్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావించింది. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటు స్పష్టంగా కనిపించింది. తొలి టెస్ట్ లోనే భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో ఇప్పుడు గంభీర్ పై వేటు వేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

కోచ్ గా గంభీర్ దారుణంగా విఫలమవుతున్నాడని మండిపడుతున్నారు. సాధారణంగా జట్టు సెలక్షన్ సమావేశాలలో హెడ్ కోచ్ పాల్గొనరు. కానీ గంభీర్ కి మాత్రం ఈ అవకాశాన్ని కల్పించింది బీసీసీఐ. కానీ ఇప్పుడు గంభీర్ కోచ్ గా విఫలమయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంభీర్ ని కేవలం టి-20, వన్డేలకు మాత్రమే కోచ్గా కొనసాగిస్తూ.. టెస్టులకు స్పెషల్ కోచ్ ని నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Esha Gupta – Hardik: మరో హీరోయిన్ తో హార్దిక్ పాండ్యా పెళ్లి… వైరల్ అవుతున్న షాకింగ్ న్యూస్

టీం ఇండియా మాజీ ఓపెనర్ గా గంబీర్ కి విశేషమైన అనుభవం ఉంది. అంతేకాకుండా 2011 వన్డే ప్రపంచ కప్ విన్నింగ్ జట్టులో గంభీర్ కూడా ఒకరు. ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో 97 పరుగులు చేసి జట్టు విజయంలోకి కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఐపీఎల్ లో కలకత్తా నైట్ రైడర్స్ జట్టుకి మెంటర్ గా కూడా వ్యవహరించాడు. 2024 ఐపీఎల్ ట్రోఫీని కలకత్తా సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ అనుభవం టీం ఇండియాకు ఉపయోగపడుతుందని బీసీసీఐ తో పాటు క్రికెట్ అభిమానులు భావించారు. కానీ ఆ మేరకు గౌతీ రాణించలేకపోతున్నాడు. దీంతో అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్స్ చేస్తున్నారు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×