2015లో జర్మనీలో ఓ విడాకుల కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. కోర్టు ఇచ్చిన తీర్పును భర్త అక్షరాలా నిజం చేయడంతో అందరూ పరేషాన్ అయ్యారు. ఇంతకీ కోర్టు ఏ తీర్పు ఇచ్చింది? భర్త ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే!
భార్య సగం ఆస్తి ఇవ్వాలన్న న్యాయస్థానం
జర్మనీకి చెందిన భార్యాభర్తల వివాహ బంధంలో గొడవలు మొదలయ్యాయి. కలిసి కొట్లాడుకోవడం కంటే విడిపోయి సుఖంగా ఉండటం మంచిదని భావించారు. విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. ఇద్దరి విడాకులకు కోర్టు అంగీకరించింది. అయితే, భర్త తన ఆస్తిలో 50 శాతం తన భార్యకు ఇవ్వాలని ఆదేశించింది. అక్కడే అసలు పేచీ వచ్చిపడింది. కోర్టు చెప్పినట్లుగానే ఇంటికి వచ్చి తన భార్యకు తన ఆస్తిలో 50 శాతం వాటా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇందుకోసం ఆయన చేసిన పని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.
ఫర్నీచర్ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువల వరకు సగం సగం..
కోర్టు చెప్పినట్లుగానే సదరు భర్త తన దగ్గర ఉన్న ఫర్నీచర్ నుంచి ఎలక్ట్రానిక్స్ వస్తువుల వరకు అన్నింటిని రెండు భాగాలుగా చేశాడు. రంపాన్ని ఉపయోగించి అన్ని వస్తువులను రెండు ముక్కలుగా కత్తిరించాడు. అతడి దగ్గర ఉన్న ఒపెల్ సెడాన్ ను రెండ ముక్కలుగా కట్ చేశాడు. అందులో ఓ ముక్కను తన భార్యకు పంపించాడు. తన ఇంట్లోని కుర్చీలు, టేబుళ్ల, మంచం సమాన భాగాలుగా ముక్కలు చేశాడు. వాటిని కూడా తన భార్యకు పంపించాడు. ఇక ఇంట్లోని ల్యాప్ టాప్, టీవీ, ఐఫోన్ ను కూడా బ్లేడ్ తో రెండు ముక్కలు చేశాడు. మెయిల్ బాక్స్, టెడ్డీ బేర్ లాంటి వస్తువులను కూడా రెండు ముక్కలుగా కత్తిరించి తన భార్యకు పంపించాడు.
Man’s divorce settlement his wife was to get 50% of everything he owned. So he took it quite literally. Got out the power tools and went to work. 🤣🤣. pic.twitter.com/g76fxibQvv
— Chad Harrison 🇺🇸🇺🇸🇺🇸 (@JeepguyTexas) June 24, 2025
EBayలో అమ్మకానికి కత్తిరించిన వస్తువులు
ఇక తన ఇంట్లోని వస్తువులను ముక్కలు చేసిన వస్తువులకు సంబంధించిన వీడియోను షూట్ చేసి, వాటని eBayలో అమ్మాకానికి పెట్టాడు. తన భార్యకు పంపించగా మిగిలిన ముక్కలు ఇవి. ఒకవేళ మీకు కావాలంటే సంప్రదించండి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. కోర్టు తీర్పు అతడికి ఇలా అర్థం అయ్యిందా? అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడితే, అతడు చేసిన పని సరైనదే అని మరికొంత మంది అభిప్రాయపడ్డారు. మొత్తంగా తన ఇంట్లోని అన్ని వస్తువులను పనికిరాని వస్తువులుగా మార్చాడు. ఈ విషయం కోర్టుకు వెళ్లిందా? ఒకవేళ వెళ్తే ఏం చెప్పింది? అనే విషయాలు మాత్రం బయటకు రాలేదు. మొత్తంగా ఈ ఘటన జర్మనీలో అప్పట్లో సంచలనం కలిగించింది. ఓ వింతైన విడాకుల కథగా మిగిలిపోయింది.
Read Also: స్కూటీ కాస్ట్ లక్ష, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కాస్ట్ 14 లక్షలు!