Rajeev Kanakala:ఇండస్ట్రీలో పేరున్న యాక్టర్ గా రాజీవ్ కనకాల(Rajeev Kanakala) కి మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది స్టార్ హీరోలకు ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో, విలన్ పాత్రల్లో నటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR), రాజీవ్ కనకాల క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ కి , రాజీవ్ కనకాలకి మధ్య ఉన్న బాండింగ్ చాలా సందర్భాలలో బయట పడింది. ఇక రాజీవ్ కనకాల క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా బిజీగా ఉన్నారు. సినిమాల్లో ఈయన గురించి ఒక సెంటిమెంట్ కూడా కొనసాగుతోంది. అదేంటంటే..రాజీవ్ కనకాల ఏ సినిమాలో చనిపోయినా ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది. అయితే ఇప్పటివరకు చాలా సినిమాల్లో ఇది వర్కౌట్ అవ్వడంతో చాలామంది దర్శకులు రాజీవ్ కనకాల పాత్ర గురించి రాసుకున్నప్పుడు చివరికి ఆయనకి చనిపోయే పాత్రని రాసుకుంటారు.
బబుల్ గమ్ మూవీ ఫలితంపై రాజీవ్ కనకాల కామెంట్..
అయితే అలాంటి రాజీవ్ కనకాల టాలీవుడ్ స్టార్ యాంకర్ అయినటువంటి సుమ (Suma) భర్త అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. సుమ – రాజీవ్ కనకాల దంపతుల కొడుకు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ అనే సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి అప్పట్లో భారీ హైప్ ని ఇచ్చారు. కానీ తీరా రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా వల్ల తాను చాలా నష్టపోయాను అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల చెప్పారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో బబుల్ గమ్ (Bubble Gum) సినిమా వల్ల మీరు ఎంత నష్టపోయారు అని యాంకర్ అడగగా..ఈ సినిమా వల్ల ఎంత నష్టపోయాను అనేది చెప్పలేను.కానీ చాలా నష్టాలు అయితే వచ్చాయి.కొంత అమౌంట్ శాటిలైట్, మ్యూజిక్, ఓటిటి వల్ల వచ్చినప్పటికీ చాలా వరకు అయితే నష్టం వచ్చింది అని రాజీవ్ కనకాల చెప్పారు..
గుడ్డిగా నమ్మి మోసపోయాను – రాజీవ్ కనకాల
అయితే రోషన్ కి ఇది మొదటి సినిమా అని తెలిసినప్పటికీ.. ఫలితాన్ని ఆలోచించకుండా సినిమా సక్సెస్ అవుతుందని గుడ్డిగా నమ్మి ఎక్కువ బడ్జెట్ పెట్టాను. అయితే నా కొడుకు సినిమా వల్ల నష్టం వచ్చినప్పటికీ రోషన్ (Roshan)కి మాత్రం మంచి పేరు వచ్చిందని రాజీవ్ కనకాల చెప్పారు.. బబుల్ గమ్ సినిమా చూసిన చాలామంది అసలు రోషన్ మొదటి సినిమాలాగా చేయలేదని, ఇప్పటివరకు చాలా సినిమాలు చేసిన అనుభవం ఉన్న వాడిలా తన యాక్టింగ్ చూపించారని ఎంతోమంది పొగిడారు. ఈ సినిమా వల్ల నష్టపోయినప్పటికీ రోషన్ కి మాత్రం మంచి కెరీర్ ఉంటుందని ఎంతోమంది మెచ్చుకున్నారు నాకు అది చాలు అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
సినిమా ఫ్లాప్ అయినా.. రోషన్ కి గుర్తింపు..
ఇక రాజీవ్ కనకాల.. రోషన్ ‘బబుల్ గమ్’ సినిమాని స్వయంగా నిర్మించారు. కానీ సినిమా వల్ల చాలా నష్టాలు వచ్చాయని చెప్పారు. రవికాంత్ పేరేపు (Ravikanth Perepu)డైరెక్షన్లో వచ్చిన బబుల్ గమ్ మూవీలో రోషన్ కనకాల సరసన మానస చౌదరి(Manasa Chaudary) హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో రొమాన్స్ ఎక్కువగా చూపించినప్పటికీ యూత్ ని అట్రాక్ట్ చేయలేకపోయింది.అలా 2023 డిసెంబర్ 29 విడుదలైన బబుల్ గమ్ సినిమా అట్టర్ ప్లాఫ్ అయింది.. కానీ నటుడిగా రోషన్ కనకాల యాక్టింగ్ కి గుర్తింపు వచ్చింది అని,ఏ పాత్ర ఇచ్చిన అందులో ఒదిగిపోయి నటించగలడు అనే నమ్మకం మాత్రం పెరిగింది అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
ALSO READ:Bigg Boss: పెరుగుతున్న బిగ్ బాస్ మృతుల సంఖ్య.. అందరి చావుకి కారణం అదేనా?