Bigg Boss: బిగ్ బాస్ (Bigg Boss).. బిగ్ బ్రదర్ గా పాశ్చాత్య దేశాలలో ప్రారంభమైన ఈ రియాల్టీ షో.. హిందీలో తొలిసారి ప్రారంభం అయింది. మొదటి సీజన్ తోనే వివిధ భాషా ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడంతో ఇప్పుడు అన్ని భాషల్లో కూడా ఈ రియాల్టీ షో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీ మొదలుకొని ఇప్పుడు టాలీవుడ్ వరకు.. అటు కోలీవుడ్ ఇటు శాండిల్ వుడ్ లో కూడా ఈ రియాల్టీ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం తెలుగులో 9వ సీజన్ త్వరలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షో కి సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మృతుల సంఖ్య..
ఇదిలా ఉండగా తాజాగా ఈ షోకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని సంవత్సరాల నుండి ప్రసారమవుతున్న ఈ షో.. ప్రేక్షకులను ఎంతగా అలరిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇదే షోలో పాటిస్పేట్ చేసిన కొంతమంది మాత్రం అనూహ్యంగా ఒకే తరహా సమస్యతో మరణించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో అసలు వారి మృతికి గల కారణం ఏమిటి అని ఆరా తీయగా.. విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. మరి బిగ్ బాస్ లో పాల్గొని ఆ తర్వాత మరణించిన వారు ఎవరు? ఏ కారణం చేత మరణించారు? అనే విషయాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఓకే తరహాలో మృత్యువాతపడుతున్న కంటెస్టెంట్స్..
ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) గుండపోటుతో మరణించడంతోనే ఇప్పుడు ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. 2016లో బిగ్ బాస్ – 7 కంటెస్టెంట్ గా పేరు సొంతం చేసుకున్న ప్రత్యూష (Prathyusha) 24 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడం నిజంగా బాధాకరమనే చెప్పాలి . ఆ తర్వాత2021లో హిందీ బిగ్ బాస్ – 13 విన్నర్ గా నిలిచిన ప్రముఖ నటుడు సిద్ధార్థ్ శుక్లా (Siddharth Shukla) కూడా ఇలా గుండెపోటుతోనే మరణించారు. అప్పటికి ఆయన వయసు 40 సంవత్సరాలు కావడం గమనార్హం. వీరే కాకుండా 2022లో బిగ్ బాస్ – 14 కంటెస్టెంట్ సోనాలి (Sonali)కూడా ఇలాగే గుండెపోటుతో మరణించారు. 2021లో మలయాళం బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ సోమస్ (Somas) కూడా ఇలాగే గుండెపోటుతో మరణించారు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..
అయితే ఇలా వీరంతా కూడా బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ చేసి ఆ తర్వాత గుండెపోటుతో మరణించిన వారే కావడం గమనార్హం . ఇక ఇలా వీరందరూ కూడా గుండెపోటుతో మరణించడంతో కొంతమంది బిగ్ బాస్ షో లో ఏర్పడే ఒత్తిడి.. దీనికి తోడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు లేకపోవడం అటు వ్యక్తిగత కారణాలు ఇలా పలు కారణాలవల్ల గుండెపోటుతో మరణిస్తున్నారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరి మరణానికి గుండెపోటే కారణమైనా.. అసలు ఈ గుండెపోటు రావడానికి అసలు కారణం ఏంటి? అన్నది మాత్రం సస్పెన్స్ గానే మిగిలింది.
ALSO READ:Decoit: ఇన్నాళ్లకు నోరు విప్పిన అడవి శేష్.. అందుకే శృతిహాసన్ ను తప్పించాం అంటూ!