BigTV English

Shivaji: డైరెక్టర్లకు శివాజీ కండీషన్… అది ఉంటేనే సినిమా చేస్తారట

Shivaji: డైరెక్టర్లకు శివాజీ కండీషన్… అది ఉంటేనే సినిమా చేస్తారట

Shivaji: శివాజీ (Shivaji)ఇటీవల బిగ్ బాస్ (Bigg Boss)కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని తిరిగి సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను ఎంతో బిజీ అవుతున్నారు. ఒకానొక సమయంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సక్సెస్ అందుకొని బిజీగా గడిపిన శివాజీ అవకాశాలు లేక కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈయన ఊహించని విధంగా బిగ్ బాస్ 7 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శివాజీ విన్నర్ అవుతారని అందరూ భావించారు కానీ టాపిక్ 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇక బిగ్ బాస్ తర్వాత పెద్ద ఎత్తున సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడుపుతున్నారు.


గంట కనిపించాల్సిందే…

ఇటీవల శివాజీ నటించిన కోర్టు(Court) సినిమాలో మంగపతి పాత్ర ఆయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ప్రస్తుతం శివాజీ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన సినిమాలో నటించే పాత్రల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ చేశారు. సాధారణంగా సినిమాలో కథ ప్రాధాన్యత ఉంటే, పాత్రనిడివి తక్కువగా ఉన్న చాలామంది ఆ పాత్రలలో చేయటానికి ఇష్టపడతారు కానీ శివాజీ మాత్రం అలా చేయటానికి అసలు ఇష్టపడనని తెలిపారు.


నా పాత్ర కనపడాలి..

డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఏదైనా ఒక సినిమా కథ చెబుతున్నారు అంటే ఆ సినిమాలో నా పాత్ర తెరపై కనీసం ఒక గంట పాటు అయినా కనిపించేలాగా ఉండాలి అలా ఉంటేనే నేను సినిమాలు చేస్తానని తెలిపారు. అలాకాకుండా మీ పాత్ర చిన్నదే అయినా మంచి ప్రాధాన్యత ఉంటుంది, మీ పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటారు అంటే నేను ఒప్పుకోనని, నా పాత్ర అందరికీ వినిపించడం కాదు, తెరపై కనిపించాలని కోరుకుంటాను అంటూ ఈ సందర్భంగా శివాజీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించినా శివాజీ ఎంతో ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే నటించారని చెప్పాలి.

రాజకీయాల పై ఆసక్తి…

ఇక బిగ్ బాస్ తర్వాత ఈయన 90’s అని వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సిరీస్ తర్వాత కోర్ట్ సినిమాలో మంగపతి అనే పాత్రలో విలన్ గా తన నటన విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో శివాజీ నటనకు ప్రేక్షకుల ఫిదా అవుతూ టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో పవర్ ఫుల్ విలన్ దొరికారు అంటూ ఈయన పాత్ర పై ప్రేక్షకుల ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇక శివాజీ సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల పట్ల కూడా ఎంతో ఆసక్తి చూపించారు. ఇక తాను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలనుకున్నానని కాకపోతే డబ్బులు లేకపోవడంతోనే పోటీ చేయలేకపోయానని, అందుకు సరిపడా డబ్బులు ఉండి, పోటీ చేసి ఉంటే నేను ఎమ్మెల్యే అయి ఉండేవాడిని అంటూ గతంలో కూడా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని తెలియపరిచారు.

Also Read: Kannappa Movie: కన్నప్ప పై ట్రోల్స్.. కర్మను తీసుకెళ్లడమే.. మోహన్ బాబు షాకింగ్ రియాక్షన్!

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×