Rayudu Murder Case: శ్రీకాళహస్తికి చెందిన యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో విచారణ జరిగే కొద్దీ కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎంక్వైరీలో భాగంగా పలు కీలక అంశాలను గుర్తించారు. మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఎంక్వైరీ అనంతరం గోపీ, బాషా, శివకుమార్, కోట వినూత, కోట చంద్రబాబును అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా నిందితుల్లో ఒకరైన శివకుమారే హత్య చేసినట్లు గుర్తించారు.
రాయుడు హత్య కేసులో అసలేం జరిగిందో ఓసారి గమనిస్తే.. చెన్నై మింట్ పీఎస్ పరిధిలోని కూపం నదిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా ఈనెల 8న పోలీసులకు సమాచారం అందింది. మొదట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు.. ఆ తర్వాత విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పరిశీలించడంతోపాటు సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్నంగా అధ్యయనం చేశారు. చివరకు మృతుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా చనిపోయింది జనసేన కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడుగా తేల్చారు పోలీసులు.
ఈ కేసులో ఐదుగురు నిందితుల్ని అదుపులోనికి తీసుకున్నారు చెన్నై పోలీసులు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి గోపీ, బాషా, శివకుమార్, కోట వినూత, కోట చంద్రబాబును అరెస్ట్ చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితుల నుంచి ఒక్కో విషయాన్ని రాబట్టారు ఖాకీలు. ఈనెల 8న రాయుడి మృతదేహాన్ని కాళహస్తి నుంచి సొంత వాహనంలోనే కోట వినూత, కోట చంద్రబాబు తీసుకెళ్ళినట్టు గుర్తించారు. దారి మధ్యలో తిరువళ్ళూరు నుంచి రాయుడి డెడ్ బాడీనీ.. తమిళనాడు నెంబర్ ప్లేట్ ఉన్న వాహనంలోకి మార్చిన విషయాన్ని తెలుసుకున్నారు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహాన్ని తరలించిన వాహనాన్ని చెన్నై పోలీసులు సీజ్ చేశారు.
ALSO READ: Janasena Party: మురికి కాలువలో వినూత పీఏ మృతదేహం.. చంపింది ఎవరు ?
మృతుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన ఇంఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పీఏగా పనిచేసేవాడు. అయితే.. కొన్ని రోజుల క్రితమే రాయుడిని ఉద్యోగం నుంచి తొలగించారు వినూత. ఈ విషయంపై ఓ బహిరంగ ప్రకటన కూడా ఇచ్చారామె. రాజకీయ ప్రత్యర్థులతో తమపై కుట్ర చేశాడని ఆరోపిస్తూ రాయుడికి, తమకు ఇకపై ఎలాంటి సంబంధం లేదంటూ ప్రకటన చేయడం అప్పట్లోనే నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక, కోట వినూత అరెస్ట్ కావడంపై స్పందించింది జనసేన. పార్టీ లైన్‌కు భిన్నంగా వ్యవహరించారని చెబుతూ.. జనసేన నుంచి ఆమెను బహిష్కరిస్తున్నట్లు తెలిపింది.
ALSO READ: AP Politics : జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఇదేనా!