Actor Srikanth: ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకోవాలి అంటే ఆశమాషీ విషయం కాదు. ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు అందుకొని ఇక్కడ నిలదొక్కుకోవాలి అంటే ఎన్నో ఒత్తిళ్లు, ఎన్నో రాజకీయాలను కూడా ఎదుర్కొని దృఢంగా నిలబడితేనే సక్సెస్ అవ్వగలరు. ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్న హీరోలు అందరూ కూడా ఇలాంటి వాటిని దాటుకునే ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎవరికైనా ఫలానా వాళ్ళు నచ్చకపోతే వారిని తొక్కేయాలని వారికి కెరియర్ లేకుండా చేయాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.
చిరంజీవి స్ఫూర్తి…
ఇలా ఎంతోమంది హీరోలు తమ కెరియర్ మధ్యలో వదులుకొని ఇండస్ట్రీ వదిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నటుడు శ్రీకాంత్ (Srikanth)విషయంలో కూడా అచ్చం ఇలాగే జరిగిందని తెలుస్తోంది. కొన్ని సినిమాల నుంచి తనని తప్పించాలి అంటూ దర్శకులకు పెద్ద ఎత్తున డబ్బును కూడా ఆఫర్ చేశారని స్వయంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ వెల్లడించారు. చిన్నప్పటినుంచి చిరంజీవి(Chiranjeevi) సినిమాలను చూస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని శ్రీకాంత్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
ఖడ్గం సినిమా..
ఇక ఈయన నటనలో శిక్షణ తీసుకున్న తర్వాత హీరోగానే అవకాశాల కోసం ఎదురు చూడలేదు తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనని తాను నిరూపించుకొని సినిమా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేశారు. ఇక శ్రీకాంత్ ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సొంతం చేసుకున్నారు. ఇలా అప్పటివరకు కుటుంబ కథా చిత్రాలలో చాలా సాఫ్ట్ గా కనిపించిన శ్రీకాంత్ ఖడ్గం సినిమాలో (Khadgam Movie)ఒక్కసారిగా యాక్షన్ తరహా పాత్రలలో కనిపించడంతో అందరూ షాక్ అయ్యారు. కృష్ణ వంశీ (Krishna Vamshi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
రెండు కోట్లు ఆఫర్…
కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే, సంగీత కీలకపాత్రలు పోషించారు. దేశభక్త ప్రధానంగా సాగే ఈ సినిమా 2002 నవంబర్ 29న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ ఏసీపీ రాధాకృష్ణ పాత్రలో అద్భుతంగా నటించారు. అయితే ఈ పాత్ర నుంచి తనని తొలగించాలని నిర్మాత సుంకర మధుమురళీ డైరెక్టర్ కృష్ణ వంశీ పై ఎంతో ఒత్తిడి తీసుకువచ్చారట. తనని ఈ సినిమా నుంచి తొలగించి జగపతిబాబు లేదా మరో పెద్ద హీరోని పెట్టుకో కావాలంటే నీకు అదనంగా రెండు కోట్లు ఇస్తాను అంటూ ఆఫర్ కూడా చేశారని తెలుస్తోంది. ఇలా శ్రీకాంత్ ను ఈ సినిమా నుంచి తప్పించడానికి తెరవెనక పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగినప్పటికీ, కృష్ణవంశీ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయకపోవటంతో శ్రీకాంత్ ఈ పాత్రను చాలా ఛాలెంజ్ గా తీసుకొని అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రశంసలు అందుకున్నారు.
Also Read: మంచు లక్ష్మి పొలిటికల్ ఎంట్రీ… ఆ పార్టీకే జై కొట్టబోతోందా?