ఈ ఘటన ఉత్తరప్రదేశ్, బరేలీలోని ఇజ్జత్ నగర్‌లో… ఓ బాలిక రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ స్కూల్‌కు వెళుతోంది. ఆమె ఎదురుగా బైక్‌పై వస్తున్న ముషబ్బీర్ అనే యువకుడు.. వాడికి పుట్టిన వంకర బుద్ధికి అక్కడే వస్తున్న అమ్మాయి దగ్గరికి వచ్చాక బాలికను అసభ్యంగా తాకి వెళ్లిపోయాడు. అతడు చేసిన పనికి బాలిక షాక్‌కు గురైంది. ఏం జరిగందో అర్థమయ్యేలోపే.. నిందితుడు బైక్‌పై వెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలిక మౌనంగా స్కూల్‌కు వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆమె ఫిర్యాదు చేసిందో లేదో తెలీదు కానీ.. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు రియాక్టయ్యారు. నిందితుడు ముషబ్బీర్ ఆచూకీని బైక్ నెంబర్, బైక్ వెళ్లిన మార్గాల్లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా తెలుసుకున్నారు.
అయితే, తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులకు చిక్కకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు.. నిందితుడు. అతనిపై పోలీసులు కాల్పులు జరపడంతో.. మోకాలి వెనుక భాగంలో తూటా తగిలి కింద పడిపోయాడు. అతని గాయానికి కట్టుకట్టిన పోలీసులు.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు లాక్కెళ్తున్నప్పుడు.. నిందితుడు ఒంటికాలిపై నడుస్తూ, బాధతో విలవిల్లాడుతున్న దృశ్యాలు చూసిన జనాలు.. అతనికి తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. అమ్మాయిలను వేధించే ప్రతి ఒక్కడి విషయంలో పోలీసులు ఇలాగే స్పందిస్తే… దేశంలో మహిళలపై అఘాయిత్యాలే జరగవని అభిప్రాయపడుతున్నారు.
Also Read: పవన్‌తో స్కెచ్.. తమిళనాడులో బీజేపీ చరిత్ర తిరగరాస్తుందా?
రోడ్డుపై వస్తున్నప్పుడు అక్కడి మార్గంలో వేళ్లే మహిళలను చూస్తే ఇంట్లో తన చెల్లి, తల్లి, భార్య వంటి వారు గుర్తుకురావాలి.. కాని వీడికి పుట్టిన వంకర బుద్దితో ఆ బాలిక ఎంతో బాధకు గురైంది. దీని పై స్పందించిన యోగి మార్క్ అతనికి తగిన శాస్త్రీ జరిపించారు. నిందితుడికి పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 78, 352, 351, POCSO చట్టంలోని సెక్షన్లు 7/8 కింద అభియోగాలు మోపినట్లు పోలీసులు నిర్ధారించారు.