Sriram Drugs Case :టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు ప్రముఖ నటుడు శ్రీరామ్ (Sriram ) అలియాస్ శ్రీకాంత్. నిన్న చెన్నైలో డ్రగ్స్ కేసు లో పోలీసులు ఈయనను అరెస్టు చేశారు. ముఖ్యంగా చెన్నై పోలీసులు ఈయనను పట్టుకున్న తీరు.. కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడులో కీలక పాత్ర పోషించిన అన్నాడీఎంకే పార్టీ మాజీ కార్య నిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు అని సమాచారం అందడంతో.. అతడితోపాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అందులో భాగంగానే హీరో శ్రీరామ్ పేరు కూడా బయటపడింది. ఆయనకు డ్రగ్స్ సరఫరా చేసామని, నిందితులు ఒప్పుకోవడంతో విచారణ మరో మలుపు తీసుకుంది.
హీరో శ్రీరామ్ కి జ్యుడిషియల్ కస్టడీ..
ఇకపోతే నిందితులు అందించిన వివరాల మేరకు హీరో శ్రీరామ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని వద్ద నుండి కోకైన్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం శ్రీరామ్ కి వైద్య పరీక్షలు నిర్వహించగా ఏకంగా 42 సార్లు డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందట. దీంతో వెంటనే హీరో శ్రీరామ్ ను నుంగంబాక్కం పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ ఆయనను మరింత గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఆ తర్వాత శ్రీరామ్ ని చెన్నై ఎగ్మోర్ కోర్టులో హాజరు పరచగా.. జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ.. జూలై 7 వరకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం శ్రీరామ్ జైల్లో ఉన్నారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టార్గెట్ చేశారంటున్నా ప్రతిపక్షాలు..
ఇకపోతే శ్రీరామ్ ఇలా డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో ఏఐడీఎంకే, బిజెపి వారిని టార్గెట్ చేశారని ప్రతిపక్షాలు కామెంట్లు చేస్తున్నాయి. మరి ఇందులో రాజకీయ నాయకుల హస్తం ఉన్న కారణంగా ఈ కేస్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
హీరో శ్రీరామ్ కెరియర్..
హీరో శ్రీరామ్ విషయానికి వస్తే 2002లో తమిళంలో వచ్చిన ‘రోజా కూటం’.. తెలుగులో ‘రోజా పూలు’ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో ‘ఒకరికి ఒకరు’ అనే సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక తెలుగు, తమిళ్, మలయాళం చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం తెలుగులో ‘ఎర్ర చీర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న హీరో శ్రీరామ్ కేస్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
ALSO READ:Chiranjeevi Mother : బిగ్ బ్రేకింగ్ – చిరంజీవి తల్లికి తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌కి తరలింపు!