Chiranjeevi Mother : మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనా దేవి(Anjana Devi) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హాస్పిటల్ కి తరలించినట్లు సమాచారం. మరొకవైపు తల్లికి అనారోగ్యం అని తెలియగానే అమరావతిలో కేబినెట్ సమావేశంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా హుటాహుటిన హైదరాబాద్ కి బయలుదేరారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం ఏపీ లో కేబినెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కూడా వచ్చారు. అయితే కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందడంతో కేబినెట్ కు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కి ఈ విషయాన్ని చెప్పి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి బయలుదేరి వెళ్లారు.
గతంలో కూడా..
అయితే ఇదే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ కూడా అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు అని, ఆమెను హుటాహుటిన కుటుంబ సభ్యుల హాస్పిటల్ కి తరలించారు అని, విజయవాడ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకొని వెంటనే హైదరాబాద్ బయలుదేరారని, చిరంజీవి కూడా దుబాయ్ నుండి బయలుదేరారు అంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే వీటిపై చిరంజీవి స్పందిస్తూ తన తల్లి ఆరోగ్యం పై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దు అని మీడియా సంస్థలను కోరారు. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా వేశారు చిరంజీవి.
తల్లి ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
చిరంజీవి తన తల్లి ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు బదులుగా తన ట్విట్టర్ వేదిక ద్వారా.. “అమ్మ అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం సాగుతోంది .ఈ విషయం తెలిసి దుబాయ్లో ఉన్న నేను హుటాహుటిన హైదరాబాద్ కి బయలుదేరానని రూమర్స్ కూడా సృష్టించారు. దయచేసి ఇలాంటి రూమర్లను ఎవరు సృష్టించకండి. అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు” అంటూ చిరంజీవి ట్వీట్ వేశారు.
వీడియో వదిలిన మెగా కోడలు.. అంతలోనే ఇలా..
ఇకపోతే ఇప్పుడు సడన్ గా ఆమె అస్వస్థతకు గురయ్యారు అని సమాచారం.. ఇదిలా ఉండగా గత కొన్ని నిమిషాల క్రితం మెగా కోడలు ఉపాసన షేర్ చేసిన ఒక వీడియోలో.. అందులో చక్కగా అంజనాదేవి తన కోడలు సురేఖతో కలిసి ఆవకాయ పెడుతున్న వీడియో అందరినీ ఆకట్టుకుంది. ఇంతలోనే ఈమె అస్వస్థకు గురైంది అంటూ ఒక వార్త రావడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అంజనా దేవి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి అటు సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఆరా తీస్తున్నారు. ఇక ఆమె ఆరోగ్యం పై వైద్యులు స్పందించే వరకు కాస్త ఆగాల్సిందే.
ALSO READ:Sriram Drugs Case : హీరో శ్రీరామ్ డ్రగ్స్ కేసు అప్డేట్… 42 రెండు సార్లు డ్రగ్స్ తీసుకున్నాడు!