BigTV English

Tips For Dry Skin: డ్రై స్కిన్ సమస్యా ? ఈ సింపుల్ టిప్స్‌తో.. బెస్ట్ రిజల్ట్

Tips For Dry Skin: డ్రై స్కిన్ సమస్యా ? ఈ సింపుల్ టిప్స్‌తో.. బెస్ట్ రిజల్ట్

Tips For Dry Skin: పొడి చర్మం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. చర్మం పొడిబారడం, పగలడం,దురద, పొలుసులుగా మారడం వంటి లక్షణాల వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. వాతావరణ మార్పులు, వేడి నీటి స్నానం, వివిధ రకాల సబ్బుల వాడకంతో పాటు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు డ్రై స్కిన్ సమస్యకు కారణం కావచ్చు. ఇలాంటి సమయంలో కొన్ని రకాల స్కిన్ కేర్ టిప్స్ పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మాన్ని ఎల్లప్పుడూ మృదువుగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు.


1. మాయిశ్చరైజర్‌ వాడకం:
పొడి చర్మం ఉన్న వారు మాయిశ్చరైజర్ తప్పకుండా వాడాలి. స్నానం చేసిన వెంటనే.. చర్మం తేమగా ఉన్నప్పుడు మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. ఇది చర్మంలో తేమను బంధించి, పొడిబారకుండా కాపాడుతుంది. అంతే కాకుండా సెరామైడ్స్, గ్లిజరిన్, హ్యాలురోనిక్ యాసిడ్, షియా బటర్ లేదా కోకో బటర్ వంటి పదార్థాలు ఉన్న మాయిశ్చరైజర్‌లను ఎంచుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజుకు కనీసం రెండుసార్లు మాయిశ్చరైజర్ రాయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు డ్రై స్కిన్ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు.

2. క్లెన్సర్‌:
పొడి చర్మం ఉన్నవారు సల్ఫేట్‌లు లేదా ఆల్కహాల్ లేని మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌లను వాడాలి. సబ్బులు చర్మంలోని సహజ నూనెలను తొలగించి.. మరింత పొడిగా చేస్తాయి. సున్నితమైన, క్రీమీ క్లెన్సర్‌లను వాడటం వల్ల చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు తేమను కూడా అందిస్తుంది.


3. వేడి నీటి స్నానం:
వేడి నీటి స్నానాలు చర్మం నుండి సహజ నూనెలను తొలగించి, స్కిన్ పొడిగా చేస్తాయి. అందుకే గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. స్నాన సమయాన్ని తగ్గించండి. 5-10 నిమిషాలకు మించకుండా స్నానం చేయడం మంచిది. స్నానం చేసేటప్పుడు మాయిశ్చరైజింగ్ బాడీ వాష్‌లను ఉపయోగించండి.

4. రాత్రిపూట స్కిన్ కేర్:
రాత్రిపూట చర్మం పునరుద్ధరించబడుతుంది. పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని.. పొడి చర్మం కోసం ప్రత్యేకంగా రూపొందించిన నైట్ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్‌ను వాడండి. ఇది రాత్రంతా చర్మానికి తేమను అందించి.. ఉదయం తాజాగా ఉండేలా చేస్తుంది.

5. హ్యుమిడిఫైయర్‌ వాడకం:
పొడి వాతావరణం చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది. ఇంట్లో హ్యుమిడి ఫైయర్‌ను ఉపయోగించడం వల్ల గాలిలో తేమ శాతం పెరిగి, చర్మం పొడి బారకుండా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Also Read: ఫ్లాక్ సీడ్స్‌తో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే జుట్టు అస్సలు రాలదు

6. రక్షణ కల్పించుకోండి:
చలి, గాలి, సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించుకోండి. బయటికి వెళ్ళినప్పుడు పొడి చర్మం ఉన్నవారు సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా వాడాలి. చలికాలంలో చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్ ధరించడం వల్ల చర్మం పొడి బారకుండా ఉంటుంది.

7. తగినంత నీరు తాగండి:
శరీరం లోపలి నుండి హైడ్రేటెడ్‌గా ఉండటం చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. రోజుకు తగినంత నీరు తాగడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. అందుకే ప్రతి రోజు 2- 3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోండి.

Related News

Anjeer: వీళ్లు.. అంజీర్‌లను అస్సలు తినకూడదు తెలుసా ?

Dasara festival 2025: నవరాత్రి పండుగకు స్పెషల్ వంటలు.. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేక రెసిపీలు

Heart Attack: వ్యాయామం చేసేటప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా ? హార్ట్ ఎటాక్ కావొచ్చు !

Healthy Hair Tips: ఆరోగ్యమైన జుట్టు కోసం సహజ చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు

Glowing Skin Tips: కెమికల్స్ లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్.. ఇలా చేస్తే చందమామలా మెరిసే చర్మం

Yoga For Brain Health: ఈ యోగాసనాలతో.. బ్రెయిన్ డబుల్ షార్ప్ అవుతుందట !

Air Fryer: ఎయిర్ ఫ్రైయర్ వంటలు ఆరోగ్యానికి ఇంత మంచివా? అస్సలు ఊహించి ఉండరు!

Alcohol: విస్కీ, వైన్, బీర్, కల్లు.. వీటిలో ఏది ఎక్కువ డేంజర్!

Big Stories

×