E-Paper
Advertisement

‘గబ్బర్ సింగ్’ రమేష్ కి అండగా నటుడు శ్రీమాన్!

‘గబ్బర్ సింగ్’ రమేష్ కి అండగా నటుడు శ్రీమాన్!
Advertisement

Gabbar Singh Ramesh:ప్రముఖ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశంలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న రమేష్.. ఈ సినిమాతో మంచి విజయం అందుకొని, సినిమా పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నారు. అలా గబ్బర్ సింగ్ రమేష్ గా చలామణి అవుతున్న ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హాస్పిటల్లో చేరిన గబ్బర్ సింగ్ రమేష్ గత కొంతకాలంగా అక్కడే చికిత్స అందుకుంటున్నారు.

గబ్బర్ సింగ్ రమేష్ కి అండగా శ్రీమాన్..

ఇకపోతే రమేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ సోకడంతో ఆయన సన్నిహితులు, సినిమా నటీనటులు కొంతమంది కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అండతో గబ్బర్ సింగ్ రమేష్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల క్రితం కూడా ఈయన గబ్బర్ సింగ్ సినిమాలోని తాము నటించిన సన్నివేశాన్ని చూస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గబ్బర్ సింగ్ రమేష్ ఆరోగ్యం కుదుటపడింది అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యులు కూడా చెబుతున్నారు.ఇకపోతే రమేష్ అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు శ్రీ మాన్ (Sriman) వెంటనే స్పందించారు.

రూ.25 వేల ఆర్థిక సహాయం..

Advertisement

రమేష్ వైద్య ఖర్చుల కోసం 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యులు తెలిపారు. ఆపదలో ఉన్న సహ నటుడికి తన వంతుగా సహాయం చేసిన శ్రీ మాన్ మంచి మనసుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. రమేష్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వెంటనే స్పందించి సహాయం అందించినందుకు శ్రీ మాన్ కి గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అనిల్ రావిపూడి మూవీతోనే పరిచయం..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ , వెంకటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘జనవరి 12న విడుదల’ అనే చిత్రంలో రమేష్ – శ్రీ మాన్ ఇద్దరు కలిసి నటించారని , ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని గబ్బర్ సింగ్ గ్యాంగ్ సభ్యులు తెలిపారు. రమేష్ అనారోగ్యానికి గురయ్యారు అనే విషయం తెలియడంతో శ్రీమాన్ స్పందించి తనకు సాధ్యమైనంత ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.

Advertisement

ALSO READ:టాక్సిక్ ఓటీటీలో బిగ్ ట్విస్ట్?

గబ్బర్ సింగ్ రమేష్ సినిమాలు..

గబ్బర్ సింగ్ సినిమాలో కామెడీ టైమింగ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈయన.. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కూడా నటించారు. తేజ సజ్జ మిరాయ్ తో పాటు నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగా ఒక రాజు చిత్రంలో కూడా ఈయన నటించారు. అంతేకాదు అడపాదడపా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు గబ్బర్ సింగ్ రమేష్. ఒకవైపు సినిమా షూటింగ్లో పాల్గొంటూనే.. మరొకవైపు అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించగా.. ఈయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఇక అప్పటినుంచి ఆయన బెడ్కే పరిమితమై చికిత్స తీసుకుంటున్నారు.

Related News

కేసీఆర్ పాత్ర అద్భుతంగా చేశావు.. ప్రియదర్శిని సత్కరించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే!

ప్రత్యేకంగా ఆ అభిమానిని కలిసిన తారక్.. వీడియో వైరల్!..

అజిత్ ఒక్కో యాడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

వారణాసి కోసం పోటీ పడుతున్న బడా నిర్మాతలు?

జీవితంలో అప్పు చెయ్యని హీరో ఎవరో తెలుసా..?

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

Big Stories

Advertisement
×