Animated Adventure Series: చేతిలో ఉన్నది ఓ చిన్న పడవ మాత్రమే. ముందున్నది అంతులేని సముద్రం. చుట్టూ ఎటు చూసినా నీళ్లే కనిపించే పరిస్థితిలో ఓ చిన్న సముదాయం తమ కల కోసం ప్రమాదకరమైన ప్రయాణం మొదలు పెడుతుంది. మార్గంలో సముద్ర దొంగలు, మెరైన్లు, విచిత్రమైన దీవులు, ఊహించని శత్రువులు ఎదురవుతుంటారు. ప్రతి అడుగు వాళ్లను ఓ కొత్త ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. అదే సమయంలో నవ్వులు, స్నేహం, సాహసం కూడా కొనసాగుతాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన వన్ పీస్ కథను ఇటుకల ప్రపంచంలో సరదాగా చూపించే స్పెషల్ సిరీస్ ‘లెగో వన్ పీస్’ (LEGO ONE PIECE). మరి ఈ సిరీస్ తాజాగా ఏ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి వచ్చింది ? తెలుగులోనూ అందుబాటులో ఉందా ? అన్న వివరాలను తెలుసుకుందాం.
లఫ్ఫీ, జోరో, నామి, ఉసాప్, సాంజి కలిసి స్ట్రా హ్యాట్ పైరేట్స్ గా ప్రయాణం మొదలుపెడతారు. వాళ్ల లక్ష్యం గ్రాండ్ లైన్ లోకి వెళ్లి వన్ పీస్ అనే అపారమైన నిధిని వెతకడం. అయితే ఆ మార్గం అంత సులభం కాదు. సముద్రంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి వాళ్లకు వరుసగా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. ఈ కథను ఉసాప్ తనదైన శైలిలో చెబుతుంటాడు. అతని మాటల్లో నిజం ఎంత ఉంటుందో, అతను జోడించే ఊహలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. ఇదే ఈ లెగో సిరీస్ లో ప్రత్యేకత.
స్ట్రా హ్యాట్ టీమ్ కి చాప్టర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు జరిగిన సాహసాలను ఉసాప్ చిన్న చాప్టర్ గా చెబుతాడు. ఆ ప్రయాణంలో లఫ్ఫీ తనకు కావాల్సిన టీమ్ ను ఒక్కొక్కరుగా కలుపుకుంటాడు. జోరో తన ఖడ్గ విద్యతో పోరాటాల్లో ముందుంటాడు. నామి నావిగేషన్ బాధ్యత తీసుకుంటుంది. సాంజి వంటగదిని చూసుకుంటూనే అవసరమైనప్పుడు యుద్ధంలోకి దిగుతాడు. ఉసాప్ మాత్రం తన కథ చెప్పే టాలెంట్ తో అందరినీ నవ్విస్తుంటాడు. వీళ్ల ప్రయాణంలో క్రేజీ పైరేట్ క్లౌన్, మెరైన్లు, ఫిష్‌మెన్, క్రిమినల్ సిండికేట్ వంటి శత్రువులు ఎదురవుతారు.
ఒక్కో దీవిలో ఒక్కో సమస్య ఎదురవుతుంది. ఎక్కడో శత్రువులతో పోరాడాలి, ఇంకెక్కడో కొత్త మిత్రులను సంపాదించాలి. ఇలా సరదా, యాక్షన్, అడ్వెంచర్ కలిసిన ప్రయాణం గ్రాండ్ లైన్ వైపు సాగుతుంది. చాప్టర్ చివర్లో వచ్చే సాహసాలు తర్వాతి వన్ పీస్ ప్రపంచానికి బేస్ గా నిలుస్తాయి. మరి క్లైమాక్స్ లో వాళ్ళు నిధిని కనిపెట్టారా ? అన్నది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే. ఇది అచ్చం వన్ పీస్ సిరీస్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇది యానిమేటెడ్ సిరీస్. పాత్రలు కూడా ఒరిజినల్ సిరీస్ లో ఉన్నవే. కాబట్టి ఇప్పటికే ఈ సిరీస్ ను చూసి ఉంటే, యానిమే ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
చెల్సీ కెర్ (Chelsea Ker) దర్శకత్వంలో రూపొందిన రెండు భాగాల యానిమేటెడ్ స్పెషల్ సిరీస్ ఇది. ఇందులో ఇనాకి గోడోయ్ (Iñaki Godoy), మకెన్యూ (Mackenyu), ఎమిలీ రడ్ (Emily Rudd) తదితరులు వాయిస్ ఇచ్చారు. సెప్టెంబర్ 29 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్‌కు నెట్ ఫ్లిక్స్ అధికారిక తెలుగు ప్రమోషన్ కూడా విడుదల చేసింది. ఇక ఈ సిరీస్ ఓటీటీలో ఇంగ్షీషు, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా