Yash Toxic OTT: మలయాళ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geethu Mohandas) దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash ) హీరోగా వచ్చిన చిత్రం టాక్సిక్. థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. పైగా ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం యశ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీ రిలీజ్ కోసం కూడా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మరోసారి నిరాశ ఎదురయింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5 సొంతం చేసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. పైగా సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జి వేదికగా స్ట్రీమింగ్ అవుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ తేదీ దాటిపోయి నాలుగు రోజులు గడిచినా.. ఈ సినిమా ఇంకా ఓటీటీలోకి రాలేదు. అక్టోబర్ నెలకు సంబంధించి జీ5 అనౌన్స్మెంట్లో కూడా టాక్సిక్ పేరు లేకపోవడంతో యశ్ అభిమానులలో నిరాశ మరింత పెరిగింది. అసలు టాక్సిక్ సినిమా ఓటీటీ రిలీజ్ ఎందుకు వాయిదా పడుతోంది ? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు? ఎందుకు ఈ విషయంపై మేకర్స్ స్పందించడం లేదు?. ఇలా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో.. అనే విషయంపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో తెలియాల్సి ఉంది.
1947-67 మధ్య గోవా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇండియాకు స్వాతంత్రం వచ్చినా.. గోవా ఇంకా పోర్చుగీసుల ఆధీనంలోనే ఉంటుంది. అక్కడ డ్రగ్స్ , అక్రమ వ్యాపారాలు, గ్యాంగ్ వార్ జరుగుతూనే ఉంటుంది. గ్యాంగ్ స్టార్ సాల్వడార్ నేతృత్వంలో ఈ ఇల్లీగల్ దందాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెడతాడు రాయా (యశ్). పుట్టగానే తల్లిదండ్రులను కోల్పోవడంతో అక్క గంగ (నయనతార) అన్ని తానై తమ్ముడిని పెంచుతూ ఉంటుంది. చిన్నప్పుడు ఎదురైన పరిస్థితుల ప్రభావంతో తమ్ముడిని గ్యాంగ్స్టర్ గా మారేలా చేస్తుంది గంగ . రాయ ఓ సాధారణ వ్యక్తిగా గ్యాంగ్ స్టర్ ప్రపంచంలోకి వచ్చి, అక్కడ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాడు. అదే సమయంలో రాయల్ సర్కస్ కంపెనీ అమ్మాయి నదియా (కియారా అద్వానీ) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు.
ALSO READ: అజిత్ ఒక్కో యాడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
అప్పటికే సాల్వడార్ కూతురు రెబెకా(తారా సుతారియ) తో రాయాకు పెళ్లి అవుతుంది. నదియా తన జీవితంలోకి వచ్చిన తర్వాత రాయ జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి. డబ్బు, అధికారం కోసం జరిగే పోరులో ఆయన చేసిన తప్పులు ఏంటి? తమ్ముడిని గ్యాంగ్స్టర్ గా చూడాలన్న గంగా కోరిక నెరవేరిందా? ప్రాణంగా ప్రేమించిన నదియా గర్భవతి అని తెలిసినా కూడా రాయ ఆమె ముఖాన్ని కూడా చూడకపోవడానికి గల కారణం ఏమిటి? ఇందులో రుక్మిణి వసంత్ పాత్ర ఏంటి? టికెట్ (యశ్) పాత్ర ఏంటి ? ఒకవైపు గ్యాంగ్ స్టర్ ప్రపంచంలో ఆధిపత్యం కోసం జరిగే పోరు.. మరోవైపు కుటుంబాన్ని కాపాడుకోవాలనే తపన ఈ రెండింటి మధ్య చేసిన ప్రయాణమే ఈ కథ.