Brian Niccol: సార్ట్ బక్స్ సీఈవో బ్రియాన్ నికోల్ కాలిఫోర్నియా నుంచి సీటెల్ లోని కంపెనీ హెడ్ ఆఫీస్ కు వారానికి మూడు సార్లు 1600 కిలోమీటర్ల దూరం ప్రైవేట్ జెట్ లో ప్రయాణించేవారు. దీంతో ఈయన ప్రైవేట్ జెట్ లో సుదీర్ధ దూర ప్రయాణం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈయన ఆఫీస్ పనుల దృష్ట్యా వారానికి మూడు సార్లు సీటెల్ లోని ప్రధాన కార్యాలయానికి వెళ్లాలి. అయితే ఇటీవల బ్రియాన్ నికోల్ సీటెల్ లోని స్టార్ బక్స్ హెడ్ ఆఫీస్ సమీపంలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో ఈయన 1600 కిలోమీటర్ల ప్రైవేట్ జెట్ ప్రయాణానికి పులిస్టాప్ పడింది. బ్రియాన్ నికోల్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల మధ్య సహకారం, కంపెనీ ఎదుగుదలను బలోపేతం చేయనుంది.
2024 లో నికోల్ స్టార్ బక్స్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొవడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ప్రకారం, కార్పొరేట్ ఉద్యోగులు అక్టోబర్ నెల నుంచి వారానికి నాలుగు రోజులు కార్యాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. గతంలోని మూడు రోజుల నిబంధన నుంచి ఒక రోజును పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుండి పై స్థాయి ఉద్యోగులు సీటెల్ లేదా టొరంటోలోని కార్యాలయాలకు రావాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం నచ్చని ఉద్యోగులు స్టార్‌బక్స్ కంపెనీకి రిజైన్ చేయొచ్చు. ఉద్యోగం మానేసిన వారికి కొంత నగదు చెల్లింపు కూడా ఉంటుందని సీఈవో తెలిపారు.
ఈ కొత్త విధానం స్టార్‌బక్స్‌లో సంస్కరణల భాగంగా బ్రియాన్ నికోల్ అమలు చేస్తున్నారు. ఎందుకంటే కంపెనీ గత కొన్ని నెలలుగా నష్టాలను చవిచూస్తుంది. అమ్మకాల తగ్గుదల, అలాగే సంస్థాగత సవాళ్లను ఎదుర్కొంటోంది. బ్రియాన్ నికోల్ ‘బ్యాక్ టు స్టార్‌బక్స్’ కార్యక్రమం కాఫీహౌస్ అనుభవాన్ని గుర్తుచేయడం, మెనూ సరళీకరణ, తాజా బేకరీ ఉత్పత్తులు, వేగవంతమైన సేవలపై దృష్టి సారిస్తోంది. ఈ చర్యలు కంపెనీ బ్రాండ్ విలువలను పునరుద్ఘాటించడంతో పాటు, ఉద్యోగుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినవిగా కంపెనీ యాజమాన్యం తెలిపింది.
ALSO READ: IBPS JOBS: గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీతో 5208 ఉద్యోగాలు, ఇంకా 4 రోజులే సమయం
బ్రియాన్ నికోల్ సీటెల్‌కు తరలివెళ్లడం కంపెనీలో ఈ కొత్త మార్కులు చోటుచేసుకుంటున్నాయి. ఆయన తీసుకొచ్చిన కొత్త సంస్కరణల వల్ల కంపెనీ లాభాల్లో నడిచే అవకాశం ఉంది. దీనికి ఉద్యోగులు సపోర్టుగా నిలుస్తున్నారు. అయితే, బ్రియాన్ నికోల్ తీసుకువచ్చిన ఈ మార్పులు కొంతమంది ఉద్యోగుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి, ఎందుకంటే రిమోట్ పని సౌలభ్యం కోల్పోవడం వారికి సవాలుగా మారవచ్చు. ఆఫీస్ కు వెళ్లి పనిచేయడం వారికి నచ్చకపోవచ్చు. మొత్తంగా, స్టార్‌బక్స్ ఈ చర్యల ద్వారా తన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి, మార్కెట్‌లో తన స్థానాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది.
ALSO READ: Heavy rain: హైదరాబాద్‌ను కమ్మేసిన క్యుములోనింబస్ మేఘాలు.. ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షం