Actor Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఇలా హీరో విశాల్ ఇంట శుభకార్యం అంటే విశాల్ పెళ్లి (Vishal Wedding)జరుగుతుంది అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈయన మేనకోడలు వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోని విశాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇలా విశాల్ మేనకోడలు విదేశీయుడిని(foreigner) ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహపు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక ఈ పెళ్లి వేడుకలలో విశాల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారని చెప్పాలి.
విశాల్ మేనకోడలి వివాహం..
సాంప్రదాయబద్ధంగా పట్టు పంచతో దర్శనం ఇచ్చిన విశాల్ చాలా ఎనర్జిటిక్ గా , యాక్టివ్ గా కనిపించారు. ఇలా ఈ పెళ్లిలో తన కుటుంబ సభ్యులందరితో సరదాగా మాట్లాడుతూ కనిపించడమే కాకుండా వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో విశాల్ అభిమానులు కూడా తన మేనకోడలికి అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం విశాల్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడిన సంగతి తెలిసిందే. కనీసం ఈయన మాట్లాడటానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. మాట స్పష్టంగా రాకపోవడం, చేతులు వనకడంతో అభిమానులు పెద్ద ఎత్తున కంగారుపడ్డారు.
నటి దన్సికతో వివాహం…
ఇలా అనారోగ్య సమస్యలతో అభిమానులను కంగారు పెట్టిన విశాల్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది. ఈ పెళ్లి వేడుకలలో ఈయన చాలా హుషారుగా ఆరోగ్యవంతంగా కనిపించారని చెప్పాలి. ఇకపోతే త్వరలోనే విశాల్ కూడా తన పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విశాల్ చివరి క్షణంలో తన పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తమిళ సినిమాలలో హీరోయిన్గా నటిస్తున్న దన్సిక (Dhanshika)ను ఈయన పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇలా తన పెళ్లి గురించి పలు సందర్భాలలో తెలియజేసిన విశాల్ త్వరలోనే తన పెళ్లి తేదీని కూడా ప్రకటిస్తానని వెల్లడించారు.
?igsh=MXRidXk4bm9kOGR0Mg%3D%3D
మరి పెళ్లి గురించి విశాల్ ఈ శుభవార్తను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక విశాల్ నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎంపిక అయిన విషయం తెలిసిందే. ఇక ఈయన అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత తన ఏకైక లక్ష్యం నడిగర్ సంఘం భవనం నిర్మించడమే అని పలు సందర్భాలలో తెలియజేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులలో ఉన్న ఈ భవనం చివరి దశలో ఉంది. అయితే ఈ భవన నిర్మాణం పూర్తి అయిన తరువాతనే తన పెళ్లి గురించి ప్రకటిస్తానని అలాగే తన పెళ్లి కూడా నడిగర్ సంఘం భవనంలో(Nadigar Building) జరుగుతుందని తెలియజేశారు. ఇక దన్సిక విశాల్ తో గత 15 సంవత్సరాలుగా మంచి పరిచయం ఉందని తెలుస్తుంది. ఇలా ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వీరిద్దరూ ఏడడుగులు నడవబోతున్నారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ జంట పెళ్లి గురించి శుభవార్తను అభిమానులతో పంచుకోనున్నారు.
Also Read: Anand Devarakonda: బేబీ హీరోయిన్ తో గొడవ.. ఇన్నాళ్లకు బయటపెట్టిన ఆనంద్.. ఇంత జరిగిందా?