Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ (Anand Devarkonda) పరిచయం అవసరం లేని పేరు విజయ్ దేవరకొండ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన ఆనంద్ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఆనంద్ సినీ కెరియర్ లో నటించిన సినిమాలలో “బేబీ” సినిమా(Baby Movie) ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎస్ కే ఎన్ నిర్మాణంలో సాయి రాజేష్(Sai Rajesh) దర్శకుడిగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ అందుకుంది. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
జాతీయ అవార్డులలో సత్తా చాటిన బేబీ…
ఇక ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో(71National Awards) కూడా ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీలలో భాగంగా ఈ సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డులు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఇక మీడియా వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతూ వచ్చారు.
రూమర్లను మీరే సృష్టిస్తున్నారు…
ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండకు ఒక రిపోర్టర్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది. బేబీ సినిమా షూటింగ్ సమయంలో మీకు హీరోయిన్ వైష్ణవి చైతన్య మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందట కదా ఇప్పటికి ఈ గొడవలన్నీ ముగిసాయ అంటూ ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నకు ఆనంద్ దేవరకొండ ఒక్క నిమిషం షాక్ అయినప్పటికీ తిరిగి సమాధానం చెబుతూ.. ఈ సినిమా షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ కాదు కదా చిన్న ఇష్యూ కూడా జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ ప్రశ్న అడగడంతో పక్కనే ఉన్న వైష్ణవి చైతన్య కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఆనంద్ వైపు చూసింది. ఇక ఆనంద్ దేవరకొండ మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఎలాంటి గొడవలు రాలేదు, మొదటిసారి మాకు గొడవలు జరిగాయని ఇక్కడే వింటున్నాను. ఇప్పటివరకు ఇలాంటి రూమర్ రాలేదు కానీ, మీరే సృష్టించేలాగా ఉన్నారే అంటూ రిప్లై ఇవ్వడంతో అందరూ నవ్వుకున్నారు.
మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన వైష్ణవి…
ఇక వైష్ణవి చైతన్య యూట్యూబర్ గా మంచి సక్సెస్ అందుకొని ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ద్వారా మొదటిసారి ఈమె హీరోయిన్ గా ఛాన్స్ అందుకోవడమే కాకుండా, మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. అయితే ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో కలిసి ఈమె నటించిన జాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిందని చెప్పాలి.
Also Read: Salman Khan: ఆఖరికి సల్లూ బాడీగార్డు కూడా యాక్టర్ అయిపోయాడు.. ఏం యాక్టింగ్ భయ్య!