Actress Himaja: బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో హిమజ (Himaja)ఒకరు. అయితే బుల్లితెరపై సీరియల్స్ కంటే కూడా హిమజ వెండి తెరపై సినిమాలలో ఎక్కువగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన పాత్ర చిన్నదైనా సినిమా అవకాశం వస్తే వదులుకోకుండా సినిమాలు చేస్తూ తద్వారా బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా సందడి చేసిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలలోనూ అలాగే బుల్లితెర కార్యక్రమాలలోనూ సందడి చేస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హిమజ ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి వచ్చే రూమర్లపై ఘాటుగా స్పందించారు అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి కూడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఎవడో ఇస్తే తీసుకున్నవి కాదు…
హిమజ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలు యూట్యూబ్ ఛానల్, పెద్ద ఎత్తున ప్రమోషన్లను చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అయితే ఈమె విలాసవంతమైన ఇల్లు కార్లు చూసి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇండస్ట్రీలో అవన్నీ మేము కష్టపడి సంపాదించుకున్నవే కానీ ఎవడో ఇస్తే తీసుకున్నవి కాదు అంటూ ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు. అలాగే కమిట్మెంట్స్ గురించి కూడా ఈమెకు ప్రశ్నలు ఎదురవడంతో నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇలాంటి కమిట్మెంట్స్ ఏవి లేవని తెలిపారు.
కమిట్మెంట్స్ అడిగే చనువు ఎందుకు ఇవ్వాలి?
సాధారణంగా నిర్మాతలు, దర్శకులు, హీరోలు కమిట్మెంట్స్ అడుగుతున్నారని ఎంతో మంది సెలబ్రిటీలు బయటకు వచ్చి చెబుతున్నారు. అలా చెప్పేవాళ్లు మీరు నిజంగానే ఆ సమస్యను ఎదుర్కొని ఉంటే వారి పేర్లతో సహా బయటకు చెప్పండి అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు అంటే అంతవరకు పరిస్థితిని ఎందుకు తీసుకువెళ్లారు? అంటూ కూడా ప్రశ్నించారు. ఇండస్ట్రీలో నా వరకు అయితే ఎలాంటి కమిట్మెంట్స్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా కమిట్మెంట్స్ ఉంటాయా అంటూ ప్రశ్న వేశారు. బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి వాటికి అసలు చోటే ఉండదని తెలిపారు..
బిగ్ బాస్ హౌస్ కమిట్మెంట్స్?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ లో రెండు మూడు ఇంటర్వ్యూలను దాటుకొని అవకాశాలను అందుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నవారి ఎంపిక అవుతారు. అలాంటి వారిని ఎక్కడైనా కమిట్మెంట్స్ అడిగితే వారి మొహం పగలగొట్టి బయటకు వస్తారని ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశామని ఎవరు మా దగ్గర ప్రస్తావించలేదని కూడా హిమజ తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఇదివరకు ఎంతో మంది సెలెబ్రెటీలు మీడియా ముందుకు వచ్చారే తప్ప వారిని ఇబ్బంది పెట్టిన వారి గురించి మాత్రం ఎక్కడా తెలియజేయలేదు. ఇక కమిట్మెంట్స్ ఇవ్వాలా? వద్ద అనేది వారి వ్యక్తిత్వం పైనే ఆధారపడి ఉంటుందని చెప్పాలి.
Also Read: Director Teja: నోటిదూల.. కోటి రూపాయలు ఫైన్ కట్టిన డైరెక్టర్ తేజ !