Kannappa Movie:ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh) దర్శకత్వంలో మంచు విష్ణు(Manchu Vishnu) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప (Kannappa) . భారీ అంచనాల మధ్య జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా దాదాపు చాలామందిని మెప్పించలేదు అని, సినిమా చూసిన ఆడియన్స్ కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తిన్నడు సినిమాను ‘భక్త కన్నప్ప’ అని చెప్పుకొని మోసం చేశారని, చాలామంది నెటిజన్స్ మంచు విష్ణు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభాస్ (Prabhas) కోసమే సినిమా చూస్తున్నారు అని కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
కన్నప్పలో భారీ తారాగణం..
అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మోహన్ లాల్ (Mohan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), శరత్ కుమార్ (Sarath Kumar), బ్రహ్మానందం (Brahmanandam), మధుబాల(Madhubala), యోగిబాబు (Yogibabu ) కీలక పాత్రలు పోషించారు. అలాగే మంచు విష్ణు కూతుర్లు అరియానా, వివియానా తో పాటు కొడుకు అవ్రామ్ కూడా వెండితెరకు పరిచయమయ్యారు. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఇతర భాష నటీనటులు కూడా కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
పైసా ఆశించకుండా నటించిన స్టార్స్ వీళ్ళే..
ఇదిలా ఉండగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించినందుకు ఒక్కొక్కరు ఎంత పారితోషకం తీసుకున్నారనే వార్త ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో చెక్కర్లు పడుతోంది. నిజానికీ ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ ఒక్క రూపాయి పారితోషకం కూడా తీసుకోలేదని విష్ణు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం ప్రభాస్ మాత్రమే కాదు మరో స్టార్ హీరో కూడా ఒక్క పైసా ఆశించకుండా సినిమాలో నటించారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. పారితోషకం తీసుకోకుండా నటించిన వారిలో మోహన్ లాల్ కూడా ఒకరు. ఈ సినిమాకి ఈయన ఒక్కరోజు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నారు. అందుకు రెమ్యూనరేషన్ తీసుకోలేదని సమాచారం.
మిగతా వారి పారిపోషకం ఎంతంటే?
ఇకపోతే ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించగా.. ఈ పాత్ర కోసం రూ.6 కోట్లు తీసుకున్నారట. కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కూడా అతిధి పాత్రలో నటించారు. ఇలా నటించినందుకు వీరు ఒక్కొక్కరు కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించినది. ఈ సినిమాలో పాటలతో పాటు కీలక సన్నివేశాలు దాదాపుగా న్యూజిలాండ్ లోనే షూటింగ్ జరిపినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి మొత్తానికైతే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కన్నప్ప సినిమాలో 30 నిమిషాల పాటు నటించి, సినిమాను ముందుకు తీసుకెళ్లి.. ఒక రూపాయి కూడా తీసుకోకపోవడం ప్రశంసనీయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Janu lyri: అదంతా నాటకమేనా.. రెండవ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన జానూ!