Swecha Death: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్‌ను జీర్ణించుకోలేక పోతోంది ఆమె కూతురు. తనను స్ట్రాంగ్ చేసి మా అమ్మ వెళ్లిపోయిందని ఆ చిన్నారి కంటతడి పెట్టుకుంది. అమ్మ అంటే తనకు చాలా ఇష్టమని, బెస్ట్ మామ్ అని గుర్తుచేసుకుంది ఆ చిన్నారి. తనకు ఏ ప్రాబ్లమ్ ఉన్న పరిష్కరించేదని ఆవేదన వ్యక్తం చేసింది.
స్వేచ్ఛ స్ట్రాంగ్ ఉమెన్ అంటు కన్నీరు మున్నీరైంది ఆమె తల్లి. తను ఒక ఫైటర్, చాలా మందికి ధైర్యం చెప్పేదని ఆమె తల్లి బలంగా చెప్తున్నారు. స్వేచ్ఛ ఓ వ్యక్తి చేతిలో మోసపోయి సూసైడ్ చేసుకుందన్నారు. ఆమెను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఆ నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె తల్లి డిమాండ్ చేశారు.
జర్నలిస్ట్ , యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచంద్రరావే కారణమని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. భర్తతో స్వేచ్ఛ విడిపోయాక.. పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటుందోని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీళ్లద్దరి మధ్య గొడవలు ఉన్నాయని.. ఆ కారణంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావుపై చిక్కడపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
స్వేచ్ఛ మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో పోస్టుమార్టం పూర్తి అయ్యింది. మరికాసేపట్లోనే రాంనగర్‌లోని తన తల్లిదండ్రుల నివాసానికి స్వేచ్ఛ మృతదేహాన్ని తరలించనున్నారు. ఇప్పటికే గాంధీ మార్చురీ దగ్గరకు జర్నలిస్టులు, స్వేచ్ఛ సన్నిహితులు చేరుకున్నారు. జోహార్ స్వేచ్ఛ అంటూ కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలుస్తోంది.
ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతిపై అనే అనుమానాలు క్రియట్ అవుతున్నాయి. స్వేచ్ఛ నిజంగానే సూసైడ్ చేసుకుందా లేక ఎవరైనా చంపి ఉంటారా? హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారా? అసలు స్వచ్ఛ మృతికి కారణాలు ఏంటి.. ఇవే ఇప్పుడు అందరిలో మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఇదే టైంలో స్వచ్ఛ తల్లిదండ్రులు మాత్రం పూర్ణచందర్ మీద సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురి మృతికి పూర్ణచందరే కారణమని చెబుతున్నారు. ఇదే ఇష్యూపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వేచ్ఛ మృతిపై ఆమె తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు.
Also Read: విశాఖలో ఆరుగురు దారుణ హత్య.. నిందితుడికి మరణశిక్ష
మరోవైపు స్వేచ్ఛ సూసైడ్ తర్వాత పూర్ణచందర్ మాత్రం పరారీ ఉన్నాడు. దీంతో పోలీసులు పూర్ణచందర్ కోసం ప్రత్యేక టీమ్స్‌గా ఏర్పడి ముమ్మరంగా గాలిస్తున్నారు. పూర్ణచందర్ ఎక్కడ ఉన్నాడు? అసలు పూర్ణచందర్ పరారీలో ఎందుకు ఉన్నాడు? స్వేచ్ఛ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లు పూర్ణచందరే హత్య చేశాడా? స్వేచ్ఛ నిజంగానే సూసైడ్ చేసుకుంటే తప్పించుకొని తిరగడం ఎందుకు? ఇలాంటి డౌట్స్ పోలీసులు, స్వేచ్ఛ కుటుంబ సభ్యుల్లో కలుగుతున్నాయి. వీటన్నింటీకి సమాధానాలు రావాలంటే స్వేచ్ఛ పోస్ట్ మార్టం రిపోర్ట్, పూర్ణచందర్ ఆచూకి దొరకడం. ఈరెండే స్వేచ్ఛ మృతిపై ఉన్న అనుమాలన్నింటికీ చెక్ పెట్టనున్నాయి.