BigTV English

Akkineni Naga Chaitanya: మన్మథుడి కొడుకా.. మజాకానా.. శోభితా, చైకు దిష్టి తీయమ్మా

Akkineni Naga Chaitanya: మన్మథుడి కొడుకా.. మజాకానా.. శోభితా, చైకు దిష్టి తీయమ్మా

Akkineni Naga Chaitanya: అక్కినేని నాగార్జున ఎప్పటికీ మన్మథుడే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 65 ఏళ్లు వచ్చినా కూడా ఇప్పటికీ కుర్ర హీరోల పక్కన నిలబడితే అందరూ నాగ్ వయస్సే తక్కువ అంటారు అనిచెప్తారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అంతగా నాగార్జున ఫిట్ నెస్ ను మెయింటెన్ చేస్తూ ఉంటాడు. ఇప్పటికీ నాగార్జున ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆయన హెల్తీ లైఫ్ స్టైల్. ఈ విషయాన్ని నాగ్ ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తానేమి ఎక్కువ డైట్ చేయనని, కరెక్టు టైమ్ కి తిని మంచిగా నిద్రపోతానని, ఉదయమే వర్క్ అవుట్స్ చేస్తాను అని తెలిపాడు.


 

ఇక తండ్రిలానే కొడుకులు కూడా తమ అందంతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య ఈ మధ్యకాలంలో చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. సమంతతో విడిపోయిన తర్వాత చై  ఎక్కువగా ఫిట్నెస్ మీద ఫోకస్ చేశాడు. నిత్యం జిమ్ లో చెమటలు చిందిస్తూ బాడీని మరింత షేప్ చేశాడు. కస్టడీ సినిమాటైమ్ లో చై లుక్కుకు ఫాన్స్ ఫిదా అయ్యారు. చాలా వరకు బరువు తగ్గి మరింత అందంగా కనిపించాడు.


 

ఇక ఈ ఏడాది శోభితను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు చైతన్య. వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత నాగచైతన్యకు లక్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. తండేల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతా ఓపెన్ చేశాడు. కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల క్లబ్ లో చేరి మరింత గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిన నాగచైతన్య ఒక్కో సినిమాకు ఒక్క లుక్ తో  కనిపిస్తూ  ప్రేక్షకులను మెస్మరైస్ చేస్తున్నాడు. తండేల్  సినిమాలో గుగురు గడ్డం లాంగ్ హెయిర్ తో కనిపించిన నాగచైతన్య తాజాగా తన కొత్త సినిమా కోసం లుక్కు మొత్తం మార్చేశాడు.

 

తాజాగా చైతన్య కొత్త లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కొద్దిగా బరువు తగ్గి ..హెయిర్ కట్ చేసి, గడ్డాన్ని ట్రిమ్  చేసి ఎంతో అందంగా కనిపించాడు.  చైతన్య న్యూ లుక్ ను చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.  ఉన్నా కొద్ది చైతన్య మరింత అందంగా మారుతున్నాడని చెప్పుకొస్తున్నారు .ఇక ఈ ఫోటో చూసినా అక్కినేని ఫాన్స్ మన్మథుడి కొడకా.. మజాకానా.. సూపర్ ఉన్నాడు అని కొందరు, మరికొందరు శోభిత.. చైతన్యకు దిష్టి తీయమ్మా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య విరూపాక్ష డైరెక్టర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ ను  ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ సినిమాతో నాగచైతన్య విజయపరంపరను కొనసాగిస్తాడా..?  లేదా..? చూడాలి.

Related News

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Big Stories

×