BigTV English

Janu lyri: అదంతా నాటకమేనా.. రెండవ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన జానూ!

Janu lyri: అదంతా నాటకమేనా.. రెండవ పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన జానూ!

Janu lyri:ఫోక్ డాన్సర్ జాను లిరీ (Janu Lyri) తన డాన్స్ తో ఎంతోమందిని మెప్పించి, అనతి కాలంలోనే స్టార్ డాన్సర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు బుల్లితెర మీద ఢీ డాన్స్ షో(Dhee Dance Show)లో పాల్గొని టైటిల్ కూడా గెలుచుకుంది. అలా ఢీ లోకి వచ్చాక జానూ లిరీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అక్కడే శేఖర్ మాస్టర్ తో జానూ లిరీకి సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తల ద్వారా జానూ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. అయితే ఈ వార్తలపై శేఖర్ మాస్టర్(Sekhar Master) స్పందించి అదంతా ఫేక్ అంటూ కొట్టి పారేశారు. అయితే జానూ గత కొద్ది రోజులుగా రెండో పెళ్లి చేసుకోబోతుందనే రూమర్లు సోషల్ మీడియాలో ఎంత వినిపిస్తున్నాయో చెప్పనక్కర్లేదు. అయితే ఓ వీడియోలో తనని ప్రతి ఒక్కరితో కలుపుతూ ఎఫైర్ వార్తలు రాస్తున్నారని, చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ జానూ లిరీ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.


దిలీప్ తో ఏడడుగులు వేయనున్న జాను లిరీ.

అయితే ఆ తర్వాత రోజే జానూ లిరీ నేను ఫోక్ సింగర్ దిలీప్ (Dilip)తో ప్రేమలో ఉన్నానని, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అంటూ జానూ అలాగే సింగర్ దిలీప్ చెప్పుకొచ్చారు. అయితే వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ జాను లిరీ క్లారిటీ ఇచ్చింది.


రెండో పెళ్లిపై జాను లిరీ క్లారిటీ ఇచ్చిందా?

అయితే జాను లిరీ మాటలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జానూ మాట్లాడుతూ.. నేను ఎప్పటికీ రెండో పెళ్లి చేసుకోను. నాకు నా కొడుకు లిరీ (Lyri)నే సర్వస్వం.. వాడితో మాట్లాడకపోతే నా ప్రాణం ఆగిపోయినట్టు ఉంటుంది. జాను ఇప్పుడు బ్రతుకుందంటే అది కేవలం లిరీ కోసం మాత్రమే..లిరీ లేకపోతే నేను లేను. వాడి కోసం నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు అంటూ మాట్లాడింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ నా కొడుకు భవిష్యత్ కోసం, నా భవిష్యత్ కోసం రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, ఇది నా స్వార్థం కోసం కాదు.. నా కొడుకు భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని ఇలా రెండో పెళ్లి నిర్ణయం తీసుకున్నానంటూ మాట్లాడింది.

నాటకాలు అంటూ జాను లిరీ పై నెటిజన్స్ ఫైర్..

అయితే జానూ లిరీ మాట్లాడిన ఈ మాటలపై చాలామంది నెటిజన్లు మండి పడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో నేను పెళ్లి చేసుకోను.నా కొడుకు కోసమే నా జీవితం అని మాట్లాడతావు.. మరో ఇంటర్వ్యూలో నా కొడుకు భవిష్యత్ కోసం పెళ్లి చేసుకుంటానంటావు. ఎన్ని నాటకాలు ఆడతావు.. ఒకసారి పెళ్ళంటావు. ఒకసారి కాదంటావ్.. ఏదైనా సరే క్లారిటీగా ఉండాలి. ఒక నిర్ణయం మీద స్టాండ్ అయ్యి ఉండాలి. అంతేకానీ పూటకో మాట మాట్లాడకూడదు. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఒకే మాట మీద నిలబడి ఉండాలి అంటూ చాలామంది సోషల్ మీడియాలో జానూ లిరీని ఏకీపారేస్తున్నారు.

మొదటి భర్తతో ప్రేమ, పెళ్లి, విడాకులు..

ఇక జానూ లిరీ మొదటి పెళ్లి విషయానికి వస్తే..జానూ మొదట ఫోక్ డాన్సర్ అయినటువంటి టోనీ(Tony) తో ప్రేమలో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ జంటకి లిరీ అనే అబ్బాయి పుట్టాక ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక విడాకులైనప్పటి నుండి జానూ తన కొడుకుతో ఒంటరిగానే ఉంటుంది. గత కొద్ది రోజుల నుండి దిలీప్ దేవగన్(Dileep Devgan) అనే ఫోక్ సింగర్ తో రిలేషన్ లో ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. చాలా రోజుల నుండి ఆయనతో సన్నిహితంగా మెదలడంతో వీరి రిలేషన్ వార్తలపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చి మేము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చెప్పారు.

ALSO READ:Actress Pakeezah: అడుక్కునే దుస్థితికి చేరుకున్న సీనియర్ నటి.. సీఎం అయినా ఆదుకోవాలంటూ!

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×