Gayatri Gupta: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బోల్డ్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న గాయత్రీ గుప్తా ఈ మధ్యకాలంలో పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని.. తనపై ఒక నిర్మాత దాడికి ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేసింది. ఇక అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. ప్రముఖ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీ తన అభిప్రాయాలను వ్యక్తపరచగా ఇప్పుడు ఆయన అభిప్రాయాలను ఆమె తప్పు బడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
గాయత్రి గుప్తా శివాజీ మాటలపై మాట్లాడుతూ..” దుస్తులు ఎలా ధరించాలనేది నా ఇష్టం . నేను చీర కట్టుకోవాలా ? డ్రెస్ వేసుకోవాలా ? అనేది పూర్తిగా నా ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరో శివాజీ అన్నారని.. నేను చీర కట్టుకోను ..నాకు ఏది సౌకర్యంగా ఉంటుందో అదే వేసుకుంటాను. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట అలా ఉంది ఆయన వ్యవహారం.. చూసే చూపులే లోపం పెట్టుకొని ఎదుటివారిని విమర్శించడం ఏ మంత్రం సరికాదు” అంటూ చాలా ఘాటుగా తన సమాధానాన్ని చెప్పింది గాయత్రీ గుప్తా. ఇకపోతే ఈమె చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత విషయం గాయత్రి మాటల్లో తప్పులేదు అంటుంటే.. మరికొంతమంది శివాజీ పెద్దవాడు ఆయన ఒక సలహా ఇచ్చారు. దానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా? అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. ఇంకొంతమంది అమ్మాయిలు పద్ధతిగా ఉంటేనే చూసేవారికి వారి పట్ల గౌరవం పెరుగుతుంది.. అని కామెంట్లు చేస్తున్నారు.. మొత్తానికైతే శివాజీ చేసిన కామెంట్లకు గాయత్రి గుప్తా ఇచ్చిన రియాక్షన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శివాజీ ఏం మాట్లాడారు అనే విషయానికొస్తే.. గత ఏడాది ఆఖరిలో ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుంటే బాగుంటుంది. వెస్ట్రన్ డ్రెస్ల కంటే అదే గౌరవప్రదం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఆ మాటలను వక్రీకరిస్తూ అప్పట్లో అనసూయ , సింగర్ చిన్మయితో పాటు పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. శివాజీ పై మహిళా కమిషన్ కూడా మండిపడుతూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇకపై జాగ్రత్తగా ఉంటానని శివాజీ కూడా తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అలా మొత్తానికైతే ఈ వివాదం అప్పుడే సద్దుమణిగింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు గాయత్రి గుప్తా ఈ వివాదానికి తెర లేపి అందరిని ఆశ్చర్యపరిచింది.
గాయత్రి గుప్తా విషయానికి వస్తే.. నటిగా, వ్యాఖ్యాతగా తనకంటూ ఒక పేరును సొంతం చేసుకున్న ఈమె.. 2014లో విడుదలైన ఐస్ క్రీమ్ 2 సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్న ఈమె.. అమర్ అక్బర్ ఆంటోనీ , కొబ్బరిమట్ట, సీత ఆన్ ది రోడ్ ఇలా పలు చిత్రాలలో నటించింది. ఇకపోతే నిత్యం సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, మీటూ సమస్యలు ఉన్నాయని చెబుతూ వార్తల్లో నిలుస్తోంది.
also read: శ్రీముఖి చేసిన పని ఎప్పటికీ మర్చిపోను.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్!