Kangana Ranaut:కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలక్షణ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. రాజకీయాలలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీలో చేరిన ఈమె.. ‘మండి’కి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకవైపు రాజకీయాలలో అధికార బాధ్యతలు చేపట్టి పలు విధులు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ఆర్.మాధవన్ (R.Madhavan) తో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
40 కి చేరువలో పెళ్లికి సిద్ధమవుతున్న కంగనా..
ఇకపోతే 39 సంవత్సరాలు వయసు వచ్చినా ఇంకా సినిమాలు,రాజకీయాలు అంటూ బిజీగా గడిపేస్తున్న కంగనా రనౌత్ పెళ్లి చేసుకోకపోవడంపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు మరోవైపు త్వరలో కంగనా అన్నింటికీ పుల్ స్టాప్ పెట్టి.. తన స్నేహితుడిని వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు రాగా.. తాజాగా ఈ వార్తలపై స్పందించింది కంగనా. తాజాగా పెళ్లిపుకార్లపై కంగనా ఊహించని కామెంట్లు చేసింది.
పెళ్లి వార్తలకు చెక్ పెట్టిన కంగనా రనౌత్..
కంగనా మాట్లాడుతూ.. “నా పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో ఎటువంటి నిజం లేదు. అయినా నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటివరకు పెళ్లిపై నేను ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ముఖ్యంగా పెళ్లి వ్యవస్థపై నాకు నమ్మకం లేదు. పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే చాప్టర్ నా జీవితానికి సరిపడవు. అందుకే నాకు పెళ్లి కావట్లేదని బాధ ఏమాత్రం లేదు. ప్రస్తుతం నా దృష్టి పూర్తిగా సినిమాలు, రాజకీయాలపైనే పెట్టాను. ఈ రంగాల్లో ఉంటూ నేను సంతృప్తిగా ఉన్నాను. కాబట్టి పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు” అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది కంగనా.. మొత్తానికైతే పెళ్లి పుకార్లకు చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి.
కంగనా రనౌత్ సినిమా కెరియర్..
ప్రముఖ భారతీయ నటిగా పేరు సొంతం చేసుకున్న కంగనా రనౌత్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాదు బాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకునే నటిగా కూడా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విషయంలో కూడా సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. తన నటనతో ఇప్పటివరకు మూడు జాతీయ అవార్డులు , నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది కంగనా రనౌత్. ప్రస్తుతం ముంబైలో తన అక్క రంగోలితో కలిసి ఉంటున్నారు. ఈమె యాసిడ్ దాడి బాధితురాలు కావడం గమనార్హం. ఇకపోతే స్వామి వివేకానంద బోధనలు పాటించే కంగనా ధ్యానమే దేవునికి అసలైన పూజా అని భావిస్తూ ఉంటుంది. ఇక శాఖాహారిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. 2013లో పెటా సంస్థ నిర్వహించిన పోల్ లో భారత హాటెస్ట్ వెజిటేరియన్ గా కూడా ఎంపికయింది.
ALSO READ:Bigg Boss 9: బిగ్ బాస్9లోకి ఓజీ నటుడు.. వర్కౌట్ అయితే ఇరకాటంలో నాగ్!