BigTV English

Bigg Boss 9: బిగ్ బాస్9లోకి ఓజీ నటుడు.. వర్కౌట్ అయితే ఇరకాటంలో నాగ్!

Bigg Boss 9: బిగ్ బాస్9లోకి ఓజీ నటుడు.. వర్కౌట్ అయితే ఇరకాటంలో నాగ్!

Bigg Boss 9: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరొకసారి అలరించడానికి బిగ్ బాస్ రియాలిటీ షో ముస్తాబ్ అవుతోంది. ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు 9వ సీజన్ కి సిద్ధమవుతోంది. ముఖ్యంగా డబుల్ హౌస్.. డబుల్ డోస్.. డబుల్ ఎంటర్టైన్మెంట్ అంటూ హోస్ట్ నాగార్జున (Nagarjuna ) ఈ సీజన్ పై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఈ షో ప్రత్యేకత ఏమిటంటే..? కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి ఏకంగా కామన్ మ్యాన్ కేటగిరీలో ఐదు మంది సామాన్యులకు అవకాశం కల్పించబోతున్నారు.


బిగ్ బాస్ అగ్నిపరీక్ష..

అందులో భాగంగానే 20వేలకు పైగా అప్లికేషన్లు రావడంతో ఫిల్టర్ చేసి 45 మందిని ఎంపిక చేశారు. ఇప్పుడు అగ్నిపరీక్ష పేరుతో ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 5 వరకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ పేరుతో ఒక మినీ షోని నిర్వహించనున్నారు. ఇందులో 15 మందిని ఎంపిక చేసి.. అందులో మళ్ళీ వివిధ టాస్కులతో ఐదు మందిని సెలెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ బిగ్ బాస్ అగ్నిపరీక్ష షోకి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిందు మాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఈ అగ్నిపరీక్షలో ఆ 15 మందికి వివిధ టాస్కులు నిర్వహించి, వారి బలాబలాలను గమనించిన తర్వాత ఆ ఐదు మందిని ఫైనలైజ్ చేసి నేరుగా హౌస్ లోకి పంపించబోతున్నారు.


బిగ్ బాస్ హౌస్లోకి నాగార్జున స్నేహితుడు..

ఇదిలా ఉండదా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి ప్రముఖ స్టార్ హీరో, నాగార్జున (Nagarjuna) స్నేహితుడు హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. అంతేకాదు సుజీత్ (Sujeeth), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాంబినేషన్లో వస్తున్న ఓజీ (OG)సినిమాలో కూడా ఈయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మరి ఆ హీరో ఎవరో కాదు వెంకట్ (Venkat). బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నారట.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ విషయం వైరల్ గా మారడంతో నాగార్జున ఇరకాటంలో పడతారేమో అని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు.

నిజమైతే.. నాగార్జున ఇరకాటంలో పడతారేమో..

సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ చేసే తప్పొప్పులను ఎప్పటికప్పుడు హోస్ట్ నాగార్జున బయటకు తీస్తూ.. వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉంటారు ఈసారి ఏకంగా ప్రాణ స్నేహితుడే హౌస్ లోకి అడగపెట్టబోతుండడంతో ఆయన జడ్జిమెంట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అయితే వెంకట్ హీరోగా హౌస్ లోకి అడుగుపెడితే మాత్రం నాగార్జున ఇరకాటంలో పడ్డట్టే అని మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే హౌస్ లోకి వెంకట్ రాక అధికారికంగా వెలువడాల్సి ఉంది.

వెంకట్ సినిమాలు..

‘ఆనందం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వెంకట్.. ‘సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి’ సినిమాతో భారీ గుర్తింపు అందుకున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మించడం జరిగింది. ఈ సినిమా సమయంలోనే నాగార్జునతో పరిచయం ఏర్పడి.. అది కాస్త స్నేహానికి దారి తీసింది అని సమాచారం. ఈ సినిమా తర్వాత అన్నపూర్ణ ప్రొడక్షన్ బ్యానర్ లో చాలా చిత్రాలలో నటించారు వెంకట్. శివరామరాజు, యువరాజు, అన్నయ్య తదితర చిత్రాలలో నటించి.. ప్రేక్షకులను మెప్పించిన వెంకట్ కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘ఇచ్చట వాహనములు నిలపరాదు ‘ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఓజీ తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు.

ALSO READ:Ganesh Aagman Hyderabad: గణేశుడికి గ్రాండ్ వెల్కమ్.. ముస్తాబవుతున్న వీధులు!

Related News

Bigg Boss AgniPariksha: అనుమానం రేకెత్తిస్తున్న మాస్క్ మ్యాన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 9 Promo : సంవత్సరానికి నలుగురు పిల్లలు కావాలా? ఏంటి శ్రీముఖి ఇది? 

Bigg Boss 9 Agnipariksha : బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఐదుగురు కన్ఫామ్..?

Bigg Boss Telugu: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Big Stories

×