BigTV English

Actress Komalee Prasad: తూచ్.. అదంతా అబద్ధం.. పుకార్లను ఖండించిన హిట్ భామా?

Actress Komalee Prasad: తూచ్.. అదంతా అబద్ధం.. పుకార్లను ఖండించిన హిట్ భామా?

Actress Komalee Prasad:సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు మేము డాక్టర్లు కాబోయే యాక్టర్లుగా మారిపోయామని చెబుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది డాక్టర్ చదువు చదివి డాక్టర్లుగా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఉన్నారు. ఇలా ఎంతోమంది డాక్టరమ్మలు మన ఇండస్ట్రీలో యాక్టర్లుగా మారి వెండితెరపై ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలాంటి డాక్టర్ చదువు చదివి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వారిలో నటి కోమలి ప్రసాద్ (Komalee Prasad)ఒకరు. ఇటీవల నాని (Nani)హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “హిట్ 3″(Hit 3) సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.


దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు..

హిట్ 3 సినిమాతో మంచి ఛాన్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే “శశివదనే”(Shasivadene) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కోమలి ప్రసాద్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన కెరియర్ గురించి వస్తున్నటువంటి పుకార్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాను సినీ ఇండస్ట్రీ వదిలిపెట్టి తిరిగి డెంటిస్ట్ గా(Dentist) ప్రాక్టీస్ మొదలు పెడుతున్నానంటూ వార్తలు వచ్చాయి అందులో ఏమాత్రం నిజం లేదని ఆ వార్తలను ఖండించారు.


శివయ్య ఆశీస్సులతో…

ఇటీవల నేను పూర్తిగా డాక్టర్ గా మారిపోయాను అంటూ నా గురించి అసత్యపు వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇదే నిజం అని కొన్ని పేరు గాంచిన మీడియా సంస్థలు ప్రచారం చేయడం బాధాకరంగా ఉందని తెలిపారు. ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని, తాను ఎన్నో ఇబ్బందులు పడి ఇండస్ట్రీలో అవకాశం అందుకొని ఈ స్థాయికి వచ్చాను. ఆ శివయ్య ఆశీస్సులతో నా ఈ సినీ ప్రయాణం మొదలైంది. నా గురించి, నా కెరియర్ గురించి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం కావడంతో నా శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ ఈమె అందరిని వేడుకున్నారు.

నటనే నా జీవన విధానం…

నటన అనేది నాకు ఒక ఉద్యోగం లాంటిది మాత్రమే కాదు.. ఇదే నా జీవితం, నా జీవన విధానం. చివరి శ్వాస ఉన్నంత వరకు తాను సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టిపోనని ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను కొత్త స్క్రిప్టులను ఎంపిక చేసే పనిలో ఉన్నానని త్వరలోనే ఎంతో విభిన్నమైన సినిమాలతో మీ ముందుకు వస్తూ మిమ్మల్ని గర్వపడేలా చేస్తా అంటూ ఈమె తన గురించి వచ్చిన వార్తలను పూర్తిగా ఖండించారు. ఇలా ఈమె స్పందించడంతో ఈ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి ఈ విధమైనటువంటి రూమర్లు రావడం సర్వసాధారణం. కొంతమంది వాటిని చూసి చూడనట్టు వదిలేస్తుంటారు, మరి కొంతమంది మాత్రం స్పందిస్తూ విమర్శలకు చెక్ పెడుతూ ఉంటారు. ఇక ఈమె కెరియర్ కి సంబంధించిన విషయం కావడంతో వెంటనే కోమలి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Also Read: మీరు ఫ్యాన్స్ కాదు.. క్రిమినల్స్.. అక్కినేని అభిమానులపై అమల ఫైర్

Related News

Kanyakumari trailer : డేటింగ్ లు లేవు అంతా బ్యాటింగ్ లే, కన్యాకుమారి ట్రైలర్

Ram Charan Peddi: వెనక్కు తగ్గిన రామ్ చరణ్, నానికి ఇదే ప్లస్ పాయింట్

Vishwambhara: విశ్వంభర వాయిదా? 2026 సమ్మర్ రిలీజ్, స్పెషల్ డేట్ ఫిక్స్

Aamir Khan: సిగరెట్ వెలిగిస్తే తప్పేంటి? స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు.!

Dasari Kiran: పోలీసుల అదుపులో రామ్ గోపాల్ వర్మ నిర్మాత దాసరి కిరణ్!

Rahul Sipligunj: కన్యాకుమారిలో రాహుల్ సిప్లిగంజ్.. నిన్న నిశ్చితార్థం.. నేడు పూజలు

Big Stories

×