Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో నగర ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. మెట్రో ద్వారా నిత్యం వేలాది మంది రాకపోకలు కొనసాగిస్తున్నారు. అయితే, ప్రతి రోజూ మెట్రోను నడపడానికి ఎంత ఖర్చవుతుంది? లోకో పైలట్లకు సాలరీస్ ఎంత ఇస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ మెట్రో నడిపేందుకు అయ్యే ఖర్చు!
హైదరాబాద్ మెట్రోను నడపడానికి విద్యుత్, మెయింటెనెన్స్, సిబ్బంది జీతాలు, ఇతర రోజువారీ అవసరాల కోసం ఖర్చు అవుతుంది. కచ్చితంగా ఇంత ఖర్చు అవుతుందనే అధికారిక లెక్కలు బయటకు తెలియకపోయినా, సాధారణ సమాచారం ఆధారంగా మనం అంచనా వేయవచ్చు.
⦿ పవర్ ఖర్చు: హైదరాబాద్ మెట్రో పూర్తిగా కరెంటుతో నడుస్తుంది. మూడు లైన్లలో (రెడ్, బ్లూ, గ్రీన్) 72 కి.మీ. కవర్ చేస్తుంది. రోజుకు దాదాపు 100 నుంచి 120 ట్రిప్పులు వేస్తాయి. తెలంగాణ లో యూనిట్ విద్యుత్ ధర రూ. 7 నుంచి రూ. 8 ఉంటుంది. అంటే రోజు వారీ విద్యుత్ ఖర్చులు రూ.5-10 లక్షలు ఉండవచ్చు.
⦿ నిర్వహణ: ట్రాక్‌లు, రైళ్లు, స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచడం అనేది చాలా ముఖ్యంగా 72 కి.మీ. నిర్వహణకు రోజుకు రూ. 15-20 లక్షలు ఖర్చవుతుంది.
⦿ సిబ్బంది జీతాలు: మెట్రోలో లోకో పైలట్లు, స్టేషన్ సిబ్బందితో సహా 200-500 మంది పనిచేస్తున్నారు. వారి జీతాలు రోజుకు రూ.6-8 లక్షలు వరకు ఉంటాయి.
⦿ ఇతర ఖర్చులు: భద్రత, టికెటింగ్ వ్యవస్థలు, కస్టమర్ సేవ వంటి వాటికి రోజుకు రూ. 5-10 లక్షలు అదనంగా ఖర్చుఅవుతుంది.
⦿ మొత్తం అంచనా వ్యయం: అన్నింటినీ కలిపితే హైదరాబాద్ మెట్రోను నడపడానికి రోజుకు రూ.30-40 లక్షలు ఖర్చవుతుంది. ఇది రోజువారీ కార్యకలాపాల కోసం మాత్రమే. ట్రాక్‌లను నిర్మించడానికి, రైళ్లను కొనుగోలు చేయడానికి అదనంగా ఉంటుంది.
Read Also : అమెరికా రైళ్ల కంటే మన వందే భారత్ బెటర్.. అక్కడి రైళ్ల స్పీడ్ ఎంతంటే ?
హైదరాబాద్ మెట్రో లోకో పైలట్ల జీతం ఎంత?
మెట్రో వ్యవస్థలో లోకో పైలెట్లు అత్యంత కీలకం. ఉద్యోగుల నివేదిక ఆధారంగా హైదరాబాద్ మెట్రోలో లోకో పైలట్ కు సగటున సంవత్సరానికి రూ. 3.0 లక్షల జీతం ఉంటుంది. ఇది లోకో పైలట్ల జాతీయ సగటు జీతం రూ.5.0 లక్షల కంటే తక్కువ. పన్నులు, ఇతర కటింగ్స్ తర్వాత లోకో పైలట్ నెలకు రూ.21,500 నుంచి రూ.23,100 వరకు తీసుకుంటారు. ఢిల్లీ మెట్రోలో లోకో పైలట్లు సంవత్సరానికి రూ. 10.2 లక్షలు తీసుకుంటారు. ఇండియన్ రైల్వేస్ లోకో పైలట్లు సంవత్సరానికి రూ.5.0-19.0 లక్షలు సంపాదిస్తారు. అంటే సగటున రూ.6.0 లక్షలు. ఇది హైదరాబాద్ మెట్రో జీతం కంటే దాదాపు రెట్టింపుగా ఉంటుంది. హైదరాబాద్ మెట్రో జీతాలు తక్కువగా ఉండటానికి కారణాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) వ్యవస్థగా కొనసాగుతుంది. అందుకే జీతాలు తక్కువగా ఉన్నాయి. ప్రతి ఏటా కొంతమేర జీతాలు పెరుగుతాయని మెట్రో సిబ్బంది చెప్తున్నారు.
Read Also : వీడో వింత దొంగ.. ఫ్లైట్లో వెళ్తే ఖర్చవుతుందని.. దారి పొడవునా 8 కార్ల దొంగతనం !