BigTV English

Mahesh Babu: మహేష్ సినిమా ఇష్టం లేదన్న నటి.. డైరెక్టర్ బలవంతం చేశారా?

Mahesh Babu: మహేష్ సినిమా ఇష్టం లేదన్న నటి.. డైరెక్టర్ బలవంతం చేశారా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)ప్రస్తుతం రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. మొదటిసారి రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. మొదటిసారి మహేష్ బాబు కూడా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం అంతే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే మహేష్ తన సినీ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన ప్రయోగాత్మక సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.


డైరెక్టర్ బలవంతంతోనే..

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో నటించడం కోసం హీరోయిన్లు ఏమాత్రం అడ్డు చెప్పకుండా కళ్ళు మూసుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం తనకు మహేష్ బాబు సినిమాలో నటించడం ఇష్టం లేదని డైరెక్టర్ బలవంతం చేయడంతోనే మహేష్ బాబుతో సినిమా చేశాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి మహేష్ బాబుతో ఇష్టం లేకుండా నటించిన ఆ హీరోయిన్ ఎవరు? ఆ సినిమా ఏంటి? అంతలా బలవంతం పెట్టిన దర్శకుడు ఎవరు? అనే విషయానికి వస్తే..


మహేష్ కు తల్లిగా ఇష్టం లేదా?

మహేష్ బాబు సినిమాలో నటించడం ఇష్టం లేదని చెప్పిన హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ నటి దేవయాని(Devayani). ఈమె హీరోయిన్ గా ఎన్నో తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక తెలుగులో కూడా సుస్వాగతం సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే ఈమె మహేష్ బాబు హీరోగా ఎస్ జె సూర్య(S.J.Suriya) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని సినిమా(Nani Movie)లో మొదటిసారి మహేష్ బాబుకి తల్లి పాత్రలో(Mother Role) నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా మహేష్ బాబు నటనకు మాత్రం మంచి మార్కులే వచ్చాయి. తాజాగా దేవయాని 3BHk సినిమాలో(3BHK) హీరో సిద్ధార్థ్ తల్లి పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 4వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా నాని సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కామెడీ ఫాంటసీ చిత్రం..

మహేష్ బాబు హీరోగా నటించిన నాని సినిమాలో మొదటిసారి తల్లి పాత్రలో నటించే అవకాశం వచ్చింది కానీ తల్లి పాత్రలో చేయాలంటే నాకు ఇష్టం లేదు కాకపోతే డైరెక్టర్ తనని బలవంతం పెట్టడం వల్లే నేను ఈ సినిమాలో నటించాను అంటూ దేవయాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఈమె పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక నాని సినిమాలో మహేష్ బాబుకి జోడీగా అమీషా పటేల్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కామెడీ ఫాంటసీ చిత్రంగా తెలుగు తమిళ భాషలలో విడుదల అయినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

Also Read: రాత్రి ఆ పని చేయనిదే నిద్రపోను.. ఇదేం అలవాటు రా సామి!

Related News

War 2 Collections : ‘కూలీ’ కన్నా ‘వార్ 2’ కలెక్షన్స్ అంత తక్కువా.. వీకెండ్ కలిసివస్తుందా..?

Himaja: హిమజా లెమన్ టాస్క్.. నీళ్లు కిందపడకుండా ఆ నిమ్మకాయను పైకి తీయగలరా?

Coolie Collections : బాక్సాఫీస్ వద్ద ‘కూలీ ‘ జోరు.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే..?

Ram Charan: త్వరలో రంగస్థలం 2.. ఆ టార్గెట్ దిశగా చెర్రీ.. నిజమైతే బన్నీ తర్వాత స్థానం!

OG Movie : ‘ఓజీ ‘ పార్ట్ 2 ఉందా..? సుజిత్ ను నమ్మొచ్చా..?

Ghattamaneni: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఘట్టమనేని వారసురాలు..అత్త కల నెరవేరుస్తుందా?

Big Stories

×