BigTV English
Advertisement

Actress Radhika: అనారోగ్యానికి గురైన నటి రాధిక… రెండు రోజులుగా హాస్పిటల్ లోనే!

Actress Radhika: అనారోగ్యానికి గురైన నటి రాధిక… రెండు రోజులుగా హాస్పిటల్ లోనే!

Actress Radhika: ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar)హాస్పిటల్ పాలయ్యారు అనే విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత మూడు రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈమె రెండు రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది. దీంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాధిక హాస్పిటల్ లో అడ్మిట్ కావడానికి గల కారణం ఏంటి?ఆమెకు ఏమైంది? అంటూ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. తమిళ మీడియా ప్రకారం ఈ నెల 28వ తేదీ రాధిక చెన్నైలోనే ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని తెలుస్తోంది.


డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న రాధిక?

రాధిక తీర్థమైన జ్వరంతో(Fever) బాధపడుతున్న నేపథ్యంలోనే హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకున్నారని అయితే పరీక్షలు నిర్వహించగా అది సాధారణ జ్వరం కాదు డెంగ్యూ(Dengue) సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ పూర్తిగా నయం అయ్యేవరకు హాస్పిటల్ నుంచి డిస్చార్జ్ కావడానికి వీలు లేదంటూ వైద్యలు సూచించిన నేపథ్యంలోనే ఈమె హాస్పిటల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. రాధిక పూర్తిగా కోలుకున్న తర్వాతనే డిశ్చార్జ్ చేయబోతున్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.


అభిమానులలో ఆందోళన…

ఇలా రాధిక అనారోగ్య సమస్య గురించి ఈ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా మీరు త్వరగా కోలుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు రాధిక అనారోగ్య సమస్యల గురించి ఆమె కుటుంబ సభ్యులు ఎక్కడ అధికారికంగా స్పందించలేదు. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు ఫోన్ చేసి ఆమెను పరామర్శిస్తున్నట్టు సమాచారం. ఇక సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన రాధిక ఇప్పటికి పలు సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

సౌత్ ఇండస్ట్రీలో అగ్రతారగా గుర్తింపు…

భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన రాధిక, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించారు. ఈమెకు తమిళంలో ఎంత ఆదరణ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ, అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.ఇక రాధిక కేవలం నటిగా మాత్రమే కాకుండా బుల్లితెర యాంకర్ గా కూడా పనిచేశారు. అలాగే సినిమాలకు, సీరియల్ నిర్మాతగా మారి ఎన్నో సీరియల్స్, సినిమాలను కూడా నిర్మించారు. అలాగే రాజకీయాలలోకి కూడా ఈమె ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇలా సినిమాల పరంగా, రాజకీయాల పరంగా రాధిక ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

Also Read: Actor Karthi: అది దా కార్తి.. తానే స్వయంగా బిర్యానీ వడ్డిస్తూ.. ‘సర్దార్ 2’పై కీలక అప్‌డేట్

Related News

Chinmayi: తాళి వేసుకోవడంపై ట్రోల్స్.. కౌంటర్ ఇచ్చిన చిన్మయి!

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Big Stories

×