BigTV English

Viral Video: డ్రైవర్ లెస్ కారులో రైడింగ్, అవాక్కైన ఇండియన్ పేరెంట్స్!

Viral Video: డ్రైవర్ లెస్ కారులో రైడింగ్, అవాక్కైన ఇండియన్ పేరెంట్స్!

Driverless Car Ride: గత కొంత కాలంగా అమెరికాలో డ్రైవర్ లెస్ కార్లు పరుగులు తీస్తున్నాయి. తొలుత టెస్లా కంపెనీకి చెందిన కార్లు డ్రైవర్ లేకుండా రోడ్ల మీద పరుగులు తీయగా, ఇప్పుడు పలు కంపెనీలకు చెందిన కార్లు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. తాజాగా ఇండియాకు చెందిన ఓ యువతి తన తల్లిదండ్రులను డ్రైవర్ లెస్ కారులో తీసుకెళ్లింది. ఈ రైడింగ్ కు చెందిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కారులు ప్రయాణిస్తూ ఆమె తల్లిదండ్రులు పొందిన అనుభూతి పట్ల ఇంటర్నెట్ క్రేజీగా రియాక్ట్ అవుతుంది.


వీడియోను షేర్ చేసిన అపూర్వ బింద్రే

ఈ వీడియోను అమెరికాలో ఉంటున్న ఇండియన్ యువతి అపూర్వ బింద్రే ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. “మా పేరెంట్స్  ను శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లెస్ కారు అయిన వేమోలో రైడ్ కోసం తీసుకెళ్లాను. వాళ్లు ఎంతో అద్భుతమైన అనుభూతి పొందారు. ఇది మాన్యువల్ డ్రైవర్ కంటే సురక్షితంగా, సున్నితంగా మరింత నమ్మదగినదిగా అనిపించింది. తొలుత 15 నిమిషాల పాటు రైడ్ చేశాం. ఇంకా సరిపోకపోతడంత మరో కారును బుక్ చేసుకున్నాం” అని రాసుకొచ్చింది.


సోషల్ మీడియాలో వైరల్

అపూర్వ బింద్రే షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు లక్షకు పైగా వ్యూస్ సాధించింది. ఇందులో అపూర్వ తన తల్లిదండ్రులను శాన్ ఫ్రాన్సిస్కో చుట్టూ వేమో రైడ్‌ లో తీసుకెళ్లినట్లు కనిపించింది. “నా తల్లిదండ్రులను డ్రైవర్ లెస్ కారులో తీసుకెళ్లడానికి నేను చాలా ఉత్సాహ పడుతున్నానని చెప్పుకొచ్చింది. సదరు కారు దానంతట అదే నావిగేట్ చేస్తున్నప్పుడు డ్రైవర్ సీటు ఖాళీగా కనిపించింది. కేవలం స్ట్రీరింగ్ మాత్రమే కదులుతూ కనిపించింది. డ్రైవర్ లెస్ కారు బుక్ చేసుకున్న తర్వాత ఆటోమేట్ గా డోర్లు అన్ లాక్ అయ్యాయి. వారు లోపలికి వెళ్లి కూర్చున్నారు. అపూర్వ స్టార్ట్ బటన్ నొక్కి రైడ్ ప్రారంభించింది. కారు తనంతట తానే నగరంలో సజావుగా ముందుకు నడుస్తూ కనిపించింది. ఆమె తల్లిదండ్రులు ఈ రైడ్ చూసి ఎంతో సంతోషంగా ఫీలయ్యారు.

Read Also: క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడా? ఆ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ పెట్టారు. ” మీ తల్లిదండ్రులు ఈ రైడ్ లో ఎంతో థ్రిల్ గా ఫీలై ఉంటారు. వారు జీవితంలో ఈ అనుభవాన్ని అస్సలు మర్చిపోయి ఉండరు” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ “ఇది డ్రైవర్ లెస్ కారు అయినప్పుడు, దానికి స్టీరింగ్ వీల్ ఎందుకు ఉంది?” అంటూ ఓ నెటిజన్ జోక్ చేశాడు. అపూర్వ బింద్రే ఆన్‌ లైన్‌ లో డ్యాన్స్ వీడియోలను పోస్టు చేస్తుంది. ఆమెకు ఇన్‌ స్టాగ్రామ్‌ లో 28,600 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Read Also: గుండెపోటు రావడానికి 12 ఏండ్ల ముందే లక్షణాలు కనిపిస్తాయా? వైద్యులు ఏం చెప్తున్నారంటే?

Related News

NHAI FASTag passes: 4 రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లు.. ఫాస్ట్ ట్యాగ్ కు ఆదాయం అదుర్స్.. ఎందుకిలా?

Good News to AP: ఇకపై అక్కడ కూడా సూపర్ ఫాస్ట్ అవుతుంది, ఇదీ కదా క్రేజీ న్యూస్ అంటే!

Ring road project: రాబోతున్న 6-లేన్ రింగ్ రోడ్.. ఇక ఇక్కడ ట్రాఫిక్ సమస్యకు గుడ్ బై!

Indian Railways: రైలు టికెట్ రద్దు ఛార్జీలు.. ఎవరికీ తెలియని అసలు నిజాలు ఇవే..!

New Railway Station: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ప్రారంభం ఎప్పుడంటే?

Big Stories

×