Ajith -Shalini: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు అజిత్(Ajith) ఒకరు. ఈయన దాదాపు మూడు దశాబ్దాలపైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇతను నటి శాలిని(Shalini) వివాహం చేసుకున్న సంగతి తెలుస్తుంది. ఇలా శాలిని వివాహం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యాక్టివ్ గా ఉండే శాలిని నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా షాలిని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
శాలిని నుదుటిపై బొట్టు పెట్టిన అజిత్…
ఇక ఈ వీడియోలో భాగంగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలలో శాలిని, అజిత్ పాల్గొన్నారని తెలుస్తుంది. ఈ వీడియోలో అజిత్ శాలిని నుదిటిపై బొట్టు పెట్టగా శాలిని ఏకంగా అజిత్ పాదాలను తాకుతూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ.. “నా హృదయాన్ని కరిగించావు.. అనే క్యాప్షన్ తో ఈ వీడియోని షేర్ చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన అభిమానులు ఈ జోడి పై కామెంట్లు చేస్తూ.. ఎంతో చూడముచ్చటైన జంట అంటూ కామెంట్లు చేస్తున్నారు.
33 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి..
ఇక ఈ వీడియో పై మరికొందరు స్పందిస్తూ.. చూడ ముచ్చటగా ఉంది.. ఇప్పటికే చాలాసార్లు ఈ వీడియో చూసాము అంటూ కామెంట్ చేయగా, ఈ ప్రపంచంలోనే శాలిని ఎంతో అదృష్టవంతురాలు అజిత్ కుమార్ కు వైఫ్ గా రావడం అంటూ ఈ వీడియో పట్ల మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీ జంట ఎంతోమందికి ఆదర్శం అని అభిమానులు ఈ వీడియో పై స్పందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో శాలిని ఎంతో సంప్రదాయపదంగా పసుపు రంగు చీర కట్టుకొని కనిపించారు. ఇక అజిత్ కుమార్ సినీ ఇండస్ట్రీలో తన 33 సంవత్సరాల కెరియర్ ను పూర్తి చేసుకున్నారు. సినిమాలు అంటే ఎంతో ఫ్యాషన్ తో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలను అజిత్ తన సొంతం చేసుకున్నారు.
?igsh=MXZ2d3FvcGIxMXk3Yw%3D%3D
ఇక ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించిన ఈయన పూర్తిగా కారు రేసింగ్ పట్ల దృష్టి సారిస్తున్న సంగతి తెలిసిందే. రేసింగ్ అంటే ఎంతో ఇష్టంతో తరచూ పలు రేసింగ్ కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు అయితే ఈ కార్ రేసింగ్ లో భాగంగా ఇప్పటికే మూడుసార్లు ప్రమాదానికి కూడా గురి అయ్యారు. ఇలా తరచూ ఈయన ప్రమాదానికి గురి కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఏ ప్రమాదంలో కూడా ఈయనకు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి తరుణంలోనే హీరో అజిత్ కు కొన్ని జాగ్రత్తలు కూడా తెలియజేస్తున్నారు. ఇక అజిత్ చివరిగా గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
Also Read: Kiara Advani: నేను డైపర్లు మారిస్తే.. నువ్వేమో.. అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కియారా!