BigTV English

Shruti Hassan: నిశ్శబ్దం.. ప్రేమలో కలుద్దాం.. వాటికి గుడ్ బై చెప్పిన శృతిహాసన్

Shruti Hassan: నిశ్శబ్దం.. ప్రేమలో కలుద్దాం.. వాటికి గుడ్ బై చెప్పిన శృతిహాసన్

Shruti Haasan: శృతిహాసన్(Shruti Hassan) లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్(Kamal Hassan) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అనగనగా ఓ ధీరుడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమైన శృతిహాసన్ కెరియర్ మొదట్లో ఎన్నో రకాల విమర్శలని ఎదుర్కొన్నారు.ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న శృతిహాసన్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో ఈమెకు కెరియర్ లో తిరుగు లేకుండా పోయింది.


సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్…

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న శృతిహాసన్ త్వరలోనే రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించిన కూలీ(Coolie) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఈమె కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. ఇలా సినిమాలతో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ అంటూ శృతిహాసన్ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా శృతిహాసన్ ను అనుసరించే వారి సంఖ్య భారీగా ఉందని చెప్పాలి.


సోషల్ మీడియాకు దూరంగా శృతిహాసన్..

ఇదిలా ఉండగా తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈమె సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు తెలియజేయడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ తో పాటు ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ నుంచి ఈమె కొద్ది రోజులు దూరంగా ఉండబోతున్నానని తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు. ఈమె డిజిటల్ డీటాక్స్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే తాత్కాలికంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నారని తెలుస్తోంది.

డిజిటల్ డీటాక్స్…

ఇక ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేస్తూ..”డిజిటల్ డిటాక్స్.. నిశ్శబ్దం.. కొంచెం ప్రేమలో కలుద్దాం” అంటూ కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నానని తెలిపారు. ఇక ఈ విషయం అభిమానులకు చిన్నపాటి నిరాశను కలిగించిందని చెప్పాలి. ఇకపోతే శృతిహాసన్ మొదటి నుంచి కూడా వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈమె ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ గురించి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలువురుతో బ్రేకప్ చెప్పుకున్న శృతిహాసన్ ప్రస్తుత సింగిల్ గా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఈమె చివరిగా ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక కూలీ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Also Read: ఆ వార్తలు చాలా బాధపెట్టాయి.. వీరమల్లు విషయంలో ఆవేదన చెందిన ఏ.యం.రత్నం!

Related News

Ilaiyaraaja : మైత్రి మూవీ మేకర్స్ కు దిమ్మతిరిగే షాక్.. 5 కోట్లు డిమాండ్..

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Big Stories

×