Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా మరికొన్ని రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల కంటే ముందుగానే ఈ సినిమాకు కమిట్ అయ్యారు. అయితే ఈయన రాజకీయ పనులలో బిజీ అవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్ పనులు ఆలస్యం అయ్యింది. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయాల(Politics)పై దృష్టి సారించారు. అయితే తనకు వీలైన ప్రతిసారి కమిట్ అయిన సినిమాల షూటింగ్ పనులలో పాల్గొంటూ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్లను పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. జ్యోతి కృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్(Nidhi Aggarwal) నటించిన చిత్రం హరిహర వీరమల్లు ఈ సినిమా జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని పనులు వాయిదా పడటంతో జులై 24వ తేది పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇలా తమ అభిమాన హీరోని వెండితెరపై ఎప్పుడు చూస్తామా అంటూ అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా జూలై 24 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇక నిర్మాత ఏ.యం. రత్నం ఇటీవల వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వీరమల్లు సినిమా విషయంలో తన ఆవేదన మొత్తం బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ సినిమాలు అంటేనే ఓవర్గానికి చెందినవారు పెద్ద ఎత్తున నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పటికే 14 సార్లు విడుదల వాయిదా పడింది అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇలా ఈ సినిమా 14 సార్లు విడుదల వాయిదా పడిందని వచ్చిన వార్తలు నన్ను ఎంతగానో బాధపెట్టాయని, ఇలాంటి వార్తలు వింటే బాధ, కోపం వస్తాయని నిర్మాత ఆవేదన చెందారు . ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి కేవలం మూడుసార్లు మాత్రమే వాయిదా పడిందని తెలిపారు. జూన్ 12వ తేదీ ఈ సినిమాని విడుదల చేయలేకపోవడంతో తాను చాలా ఫీల్ అయ్యానని నిర్మాత ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సినిమా కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాల సమయం కేటాయించిన నేపథ్యంలోనే భారీ స్థాయిలో బడ్జెట్ కూడా ఖర్చు అయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు మొదట్లో దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)పనిచేశారు అయితే ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ సినిమా బాధ్యతలను తీసుకున్నారు. జులై 24వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాల్సింది.
Also Read: డైరెక్టర్ టూ పాన్ ఇండియా స్టార్.. రిషబ్ శెట్టి సినీ ప్రస్థానం!