Bahubali – Cricketers: ఎస్. ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క శెట్టి, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ తెలుగు మూవీ సినీ ఖ్యాతిని ప్రపంచ యవనికపై నిలబెట్టింది. బాహుబలి సినిమాతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, బాహుబలి చిత్రాలకు మంచి క్రేజీ వచ్చింది.
Also Read: Indian Team Record: 89 ఏళ్లుగా వెంటాడుతోన్న దరిద్రం..మాంచెస్టర్ టెస్ట్‌లోనూ టీమిండియాకు ఓటమే..?
అప్పట్లో ఈ సినిమా హిందీలో తొలి 100 కోట్లకు నెట్ వసూళ్లను సాధించిన తొలి డబ్బింగ్ మూవీగా రికార్డ్ నెలకొల్పింది. బాలీవుడ్ మార్కెట్ పై ఓ తెలుగు చిత్రం ఈ రేంజ్ ఇంపాక్ట్ చూపించడం అనేది ఇదే మొదలు. ఈ చిత్రం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 600 కోట్ల గ్రాస్ వసూలు సాధించి ఔరా అనిపించింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? అంటూ పదేళ్ల కిందట యావత్ భారతదేశం ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురుచూసింది.
ప్రపంచ సినిమా హిస్టరీలోనే తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాలకు చేర్చిన ఈ చిత్రం ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకొని మూవీ యూనిట్ ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. బాహుబలి 2 భాగాలను కలిపి.. “బాహుబలి: ది ఎపిక్” పేరుతో ఒకే భాగంగా ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న ఈ విజువల్ వండర్ మరోసారి వెండితెరపై కనువిందు చేయబోతోంది.
బాహుబలి పాత్రల్లో క్రికెటర్లు:
ఈ క్రమంలో బాహుబలి చిత్రంలోని పాత్రలను టీమిండియా క్రికెటర్లకు ఆపాదించి.. ఎవరెవరు ఏ పాత్రలో సూట్ అవుతారు అనేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} ద్వారా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్లు చిన్నపిల్లల్లా మారితే ఎలా ఉంటారు, దేవుళ్ళ గెటప్ లో ఎలా ఉంటారు, లావుగా మారితే ఎలా ఉంటారు, మహిళల్లా మారితే ఎలా ఉంటారు.. ఇలా పలు రకాల ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇప్పుడు టీమిండియా క్రికెటర్లు బాహుబలి పాత్రల్లో నటిస్తే ఎవరికి ఏ పాత్ర సెట్ అవుతుంది, వారు ఎలా ఉంటారన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కట్టప్ప పాత్రలో గౌతమ్ గంభీర్:
ఇందులో ముఖ్యంగా కట్టప్ప పాత్ర ఏ క్రికెటర్ కి ఇచ్చారంటే.. టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి కట్టప్ప పాత్రను కేటాయించారు. ఎందుకంటే.. అమరేంద్ర బాహుబలికి కట్టప్ప ఎలా అండగా నిలిచాడో.. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో 97 పరుగులు, 2017 టి-20 ప్రపంచ కప్ ఫైనల్ లో 75 పరుగులు చేసి భారత విజయంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక అమరేంద్ర బాహుబలి గా మహేంద్రసింగ్ ధోనీ ఫోటోని క్రియేట్ చేశారు. అమరేంద్ర బాహుబలి తీవ్ర ఒత్తిడిలోనూ రాజ్యానికి నాయకత్వం వహిస్తూ, ప్రశాంతంగా ఉంటాడు. ఆ పాత్ర టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది.
అమరేంద్ర బాహుబలి లాగా ధోనీని కూడా చాలామంది అభిమానులు ప్రేమిస్తారు. ఇక ఈ ఫోటోలలో మహేంద్ర బాహుబలి గా రోహిత్ శర్మ కనిపించాడు. అమరేంద్ర బాహుబలి కుమారుడు మహేంద్ర బాహుబలి సాధారణ ప్రపంచంలో నుండి రాజుగా తన సరైన స్థానాన్ని తిరిగి పొందాడు. ఇక రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం కూడా మహేంద్ర బాహుబలి పాత్రను ప్రతిబింబిస్తుంది. ఓ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా రాణించిన రోహిత్ శర్మ.. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టి, డబుల్ సెంచరీలు చేసి, 2019 ప్రపంచ కప్ లో 5 సెంచరీలు, 2024 టీ-20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ గా విజయవంతం అయ్యాడు.
ఇక బల్లాలదేవ పాత్రలో యువరాజ్ సింగ్ కనిపించాడు. ఈ చిత్రంలో భల్లాల దేవను విలన్ గా చిత్రీకరించినప్పటికీ.. అతడు ఓ యోధుడు. యుద్ధంలో శక్తివంతంగా పోరాడిన ధీరుడు. యువరాజ్ సింగ్ కూడా మైదానంలో ఎన్నో పోరాటాలు చేశాడు. ముఖ్యంగా క్యాన్సర్ ని ఓడించిన తర్వాత అతడు తిరిగి వచ్చి.. అటు బ్యాట్, ఇటు బంతితో అద్భుతంగా రాణించాడు. 2011 ప్రపంచ కప్ లో భారతదేశానికి హీరోగా నిలిచాడు.
ఇక బిజ్జలదేవ పాత్రలో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ కనిపించారు. ఈయన తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెబుతూ.. భల్లాలదేవ పాత్రలో ఒదిగిపోతాడని ఆయనకు ఈ పాత్రను కేటాయించారు. ఇక ఇంకోషి పాత్రలో కాలకేయ తెగకు చెందిన భయంకరమైన రాజుగా కిరణ్ పోలార్డ్ ఫోటోని క్రియేట్ చేశారు. అతడు తన పవర్ హిట్టింగ్ తో గేమ్ ని మలుపు తిప్పడానికి ప్రసిద్ధి చెందాడు.
ఇక చివరగా కుమార వర్మ పాత్రని యుజ్వేంద్ర చాహల్ కి కేటాయించారు. బాహుబలి చిత్రంలో కుమార వర్మ అతని అమాయకత్వం, హాస్య భరితమైన సన్నివేశాలకు ప్రసిద్ధి. చాహల్ కూడా మైదానంలో ఎప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అలాగే కుమార వర్మ లాగా అతడిలోని శక్తి సామర్థ్యాలు అతడికి తెలియవు. చాహల్ కూడా చాలా సందర్భాలలో తన స్పిన్ మాయాజాలంతో ఎన్నో మ్యాచ్లను మలుపు తిప్పాడు. ఇలా బాహుబలి చిత్రంలోని పలు పాత్రలను క్రికెటర్లకు ఆపాదించి.. ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.